Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6844

కానీవయ్య అందుకేమి కనుకొనే మన్నియును

రాగము: కాంబోది

కానీవయ్య అందుకేమి కనుకొనే మన్నియును
తేనెల మా మోవితీపు దిమ్ము రేఁచును॥పల్లవి॥
  
  
నగినట్లనె వుండు నాతోడి పొందులు
చిగురించఁ జిగురించ చేఁగలెక్కును
యెగసక్యాలై యుండు ఇప్పుడు నేనన్నమాట
తెగరాని ఆసలతో తీగెసాగును॥కానీ॥
  
  
దక్కినట్లనే వుండు తతి నాతో చేఁతలెల్ల
చిక్కినప్పుడు చేతికి జిడ్డుదేరును
లెక్కసేయనట్లుండ్లు లేఁతమాసరసాలు
వక్కణతో వలపు పూవక పూచును॥కానీ॥
  
  
పట్టినట్లనే వుండు పై పై మాతో పంతములు
మట్టుపెట్టి ముయికి ముయి మళ్లించును
ఇట్టె శ్రీవేంకటేశ యెనసితి విటు నన్ను
పట్టినచలములెల్లా పంటవండును॥కానీ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!