Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6864

కానీవే తన వేసాలు కనుఁగొంటిఁ గా

రాగము: శంకరాభరణం

కానీవే తన వేసాలు కనుఁగొంటిఁ గా
వీనులకు యీ సుద్దులు వెరగాయఁగా॥పల్లవి॥
  
  
చెప్పరే చెప్పరే వీనిచేఁతలు నాకు
అప్పుడే యాపెతో మాట లాడి వచ్చెవా
ముప్పిరి నా కిఁక నేఁటి మొకమోటమే
తప్పని బొంకనివాఁడు తా నెందు వోయీనే॥కానీవే॥
  
  
యెంత కెంత వీనిసుద్దు లేల దాఁచేరే
దొంతిగా నాపెను వెంటఁ దోడి తెచ్చెనా
పంతపుమోనము లిఁకఁ బనికి రావె
సంతసమే చేసేఁ గాక జగడించేనా॥కానీవే॥
  
  
యే మంటి రే మంటిరే యెఱఁగ నేను
చే మట్టి యాపెను నాచేతి కిచ్చెనా
కామించి శ్రీవెంకటాద్రికడపరాయఁడు నన్ను
గోమునఁ గూడె నిదియుఁ గొంత వలెనా॥కానీవే॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!