Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6869

కానీవే యెందు పొయ్యేము కందము తననేమము

రాగము: పాడి

కానీవే యెందు పొయ్యేము కందము తననేమము
తానే పంతములు పాఁతరఁ బెట్టకుండీనా॥పల్లవి॥
  
పిలిచితే రాఁ డట్టే బిగిసీ నీపాటి వాఁడు
చెలఁగి మనసు రాయి సేయకుండీనా
సెలవుల నగినాను చేరి అది యేలనఁడు
తెలిసి వూవుటమ్ములు తెగఁ గోయకుండీనా॥కానీ॥
  
కానుకిచ్చితే నొల్లఁడు కపటమంత గలితే
దీనకాన వలపు ముద్రించకుండీనా
వీనులలర నే విన్నవించినాను వూఁకొనఁడు
మానినుల జవ్వనాలు మాన్పకుండీనా॥కానీ॥
  
కదిసితేఁ బైకొనఁడు కాఁకలింత సేసేవాఁడు
కదలించి మరు నుట్టిఁగట్టకుండీనా
ఇదివో శ్రీవేంకటేశుఁ డెనసితే మన్నించె
పెదవితేనె చక్కెరబిల్ల సేయకుండీనా॥కానీ॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!