Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6880

కామాతురునకును గర్వ మెక్కుడు

రాగము: దేసాళం

కామాతురునకును గర్వ మెక్కుడు
వేమారుఁ బెచ్చువెరిగి విఱ్ఱవీఁగు మిఁకను॥పల్లవి॥
  
  
నీకేల వెరపూ నీవిన్నిటా దొరవూ
చేకొని యేమి చేసినాఁ జెల్లును నేడు
యీకడనాకడ సతు లెందరైనా నున్నవారు
చేకొని మత్తుఁడవై చెలరేఁగు మిఁకను॥కామా॥
  
  
అడ్డాఁక లేడవి అన్నిటాఁ దెగుదారివి
వొడ్డారాన నెట్టుండినా వొరపే నీకు
జడ్డుదేరె తమ్ములము సరి నీపుక్కిళ్ల నదె
దొడ్డగాఁ జొక్కుచు సోలి తుదమీరు మిఁకను॥కామా॥
  
  
పండెను నీతపమూ పట్టినదెల్లాఁ బైఁడి
అండనే నన్నుఁ గూడితి వాయను పని
నిండఁగ శ్రీవేంకటాద్రినిధిఁ దొక్కివున్నాఁడవు
కొండవంటి వుబ్బుతోడఁ గొల్లగాను మిఁకను॥కామా॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!