Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6893

కామినులాల మీ కన్నులఁ బట్టఁడా బాలుఁ-

రాగము: సాళంగం

కామినులాల మీ కన్నులఁ బట్టఁడా బాలుఁ-
డేమమ్మా నవ్వేరు వీఁ డేమాయనమ్మా॥పల్లవి॥
  
  
చూడఁగలవాఁడు చేతఁ జూపఁగలవాఁడు వీఁడు
యేడ నెవ్వరైనాఁ గంటే నెత్తుకోఁదగువాఁడు
జాడతో రూపురేకా సాదించరానివాఁడు
యీడనే మాపసిబాలుఁ డేమాయనమ్మా॥కామి॥
  
  
అడుగఁదగినవాఁడు అన్నిటానుదారివాఁడు
వుడిబడి వారి నేల నోల్లనివాఁడు
వడిఁ దానే ఇందరిని వలపించనేర్చువాఁడు
యెడసీ ముద్దాడమనే రేమాయనమ్మా॥కామి॥
  
  
రచనమాటలవాఁడు రచ్చరాళ్ల మీఁదివాఁడు
ఇచట శ్రీవేంకటాద్రిపై నిరవైనాఁడు
పచరించ నేపనులాఁ బదిఁ బదైనవాఁడు
యెచట నాడి వచ్చినా నేమాయనమ్మా॥కామి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!