Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6958

కర్త :: తాళ్లపాక అన్నమాచార్య

రాగము: శంకరాభరణం

కాంతలకుఁ బురుషులకుఁ గలదెల్ల నిందాఁక
వింత విూఱిపుడేల వేసంటందాఁకా॥పల్లవి॥
  
  
తాలిములు మేలిములు దగ్గరిన యందాఁక
చాలైన కుంటెనలు సతమైనదాఁకా
వాలుఁజూపుల సొలపువలలఁ జిక్కినదా క
జోలిమాటలు తమకు సొలసినందాఁకా॥కాంత॥
  
  
అడఁకువలు మోనములు అలుక దీరినదాఁక
వడిగొన్న కోరికెలు వలసినందాఁకా
కడలేని జంకెనలు కైవసం బౌదాఁక
వుడివొని పంతములు వోపినందాఁకా॥కాంత॥
  
  
రతివేళ మోహములు రాకొట్టి నందాఁక
అతనుభోగములు మే నలసి నందాఁకా
యితవైన శ్రీవేంకటేశ నీకును సతికి
తతి నిట్లఁ గూడ సంతము లయినదాఁకా॥కాంత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!