Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6980

కాంతుఁడు మరుని యాజ్ఞ కడవలేఁ డింతే కాక

రాగము: దేసాళం

కాంతుఁడు మరుని యాజ్ఞ కడవలేఁ డింతే కాక
కొంతైన నెరఁగఁడా కోన చెన్నరాయఁడు॥పల్లవి॥
  
  
వలపు నిలుప లేక వనితకు మొక్కెఁ గాక
సొలప వాఁ డటువంటి సుద్దులవాఁడా
చెలిమి విడువ లేక చెయివూఁత యిచ్చెఁ గాక
కొలమున నేమి తక్కువవాఁడా॥కాంతుఁడు॥
  
  
ఆసలు మానఁగ లేక ఆకు మడి చిచ్చెఁ గాక
వేసాల వాఁ డటువంటి విద్యలవాఁడా
బాసలు దప్పఁగ లేక బడినె తిరిగెఁ గాక
యీసున దొరతనము లెఱఁగనివాఁడా॥కాంతుఁడు॥
  
  
పొందు విడువఁగ లేక పొత్తున భుజించెఁ గాక
అందగాఁ డాతఁ డెంగి లంటేవాఁడా
అంది శ్రీవెంకటనాథు డాపెఁ గూడితే నేమి
చందముగా నాతోడి సమరతి మానేనా.॥కాంతుఁడు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!