Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6998

కూచుండవే ఇంకా వట్టిగట్టు లేఁటికి

రాగము: వరాళి

కూచుండవే ఇంకా వట్టిగట్టు లేఁటికి
వాచవులు మరిగిన వలపులు మానీనా॥పల్లవి॥
  
  
చనుఁగవ గప్పకువే సకియా మన-
మనసులలోనికి మఱఁగున్నదా
తనిసి నీనవ్వేల దాఁచేవే
కనుగొన నెమ్మోముకళలు దాగీనా॥కూచుం॥
  
  
మాటలేల మొఱఁగేవే మగువా మన-
మూఁటల ఆసలలోన మొఱఁగున్నదా
చీటికిమాఁటికి నేల చేయి దీసేవే
కూటపురతిఁ జేయి దీసుకొనవచ్చునటవే॥కూచుం॥
  
  
కూడితివేల నించేవే గుఱుతులు మన-
కోడె వయసులకును గుఱియున్నదా
యీడుగల శ్రీవేంకటేశుఁడఁ గదే
యీడుజోడు మనకంటే నిఁక మఱి వున్నదా॥కూచుం॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!