Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7026

కూరిమెరిఁగి కైకోవు - నీ-

రాగము: భైరవి

కూరిమెరిఁగి కైకోవు - నీ-
బీరములే నెరుపేవు॥పల్లవి॥
  
  
రంతులె సేసిటు రావు -
యెంతైనాఁ జననీవు
చెంతలె కడుఁ దలఁచేవు -
ఇంతలోనె రవయ్యేవు॥కూరి॥
  
  
పొలయుచు నూరకె పోవు-
గిలిగింపుచుఁ దిరిగేవు
చెలఁగుచు వడి మురిసేవు-
నిలరా యించుక నీవు॥కూరి॥
  
  
బొంకుచు నూరకె పోవు-
తెంకికి నెవ్వతెఁ దేవు
వేంకటపతి నవ్వేవు-
పొంకమైతివిఁకఁ బోవు॥కూరి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!