Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7049

కొచ్చి నేఁ బైకొనేనంటే గోలదానను

రాగము: బౌళి

కొచ్చి నేఁ బైకొనేనంటే గోలదానను
యెచ్చిన నా వలుపే ఇంత సేసే నన్నును॥పల్లవి॥
  
నీ మొగము చూచితేను నీ సుద్దులు దలఁపౌను
చే ముట్టితే పులకలు చిమ్మి రేఁగును
కామించి వద్ద నుండితే కళలు దైవారును
యేమి సేతు నా వలపు లింత సేసే నన్నును॥॥
  
విన్నపము సేసేనంటే వెస నిండీ సిగ్గులు
పన్ని వేఁడఁబోతే ముంచీఁ బరవసము
సన్నలు సేసేనంటే జలజలఁ జెమరించీ
యెన్నరాని నా వలపు వింత సేసే నన్నును॥॥
  
సరసము లాడేనంటే సంతోము లెల్లఁ దొట్టీ
అరుదుగా నవ్వేనంటే నాసలు వుట్టీ
యెరవు లేని శ్రీ వేంకటేశ యలమేల్మంగను
యిరవైతి నా వలపు లింత సేసే నన్నునూ॥॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!