Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7115

కొలువులోపలనున్న కొమ్మలెల్లా నవ్వేరు

రాగము: దేసాళం

కొలువులోపలనున్న కొమ్మలెల్లా నవ్వేరు
కొలఁది మీరకువయ్య గోవిందరాజా॥పల్లవి॥
  
  
పాదములొ త్తేయట్టి పడఁతికి నిదివొ
ఆదిగొని చెమరించె నంగమెల్లాను
కాదనక పచ్చడము గప్పి మఱఁగుననె
పోదితో నాపెఁ దనివిబొందిఁచవయ్యా॥॥
  
  
సరుసఁ గూచుండినట్టికియకు నిదివొ
సిరులుగాఁ బులుకించె చెక్కులెల్లాను
తెరవేసుకొని సిగ్గుదేరిచి గుట్టుననె
గరిమతో లోలోనె కాఁగిలించవయ్యా॥॥
  
  
శ్రీసతికి భూసతికిఁ జేరి కూడఁగ నిదివొ
రాసి నిట్టూర్పులు మిఁచె రతులలోనా
ఆసతోడుత శ్రీ వేంకటాద్రి గోవిందరాజ
లేసుగా నిద్దరిని లాలించఁగదవయ్యా॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!