Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7140

కొంకనేల యింకను కొమ్మలము నీకును

రాగము: బౌళి

కొంకనేల యింకను కొమ్మలము నీకును
సంకెదేర్చి మామాటకే సమ్మతింతుగాక॥పల్లవి॥
  
  
చనవువారము గాక సరివారమా నేము
మనసేమి చూచేవు మాతోడను
వెనకవారమే మేము వేడుకకాఁడవు నీవే
పనిగొని మమ్మునిట్టె పాలింతు గాక॥కొంక॥
  
  
యిచ్చకమాడేము గాక యెదురుమాటాడేమా
వచ్చియేల సేసేవు పలుమారును
మెచ్చితిమప్పుడే నిన్ను మించె నీజాణతనాలు
కచ్చు పెట్టి మమ్మునిట్టె కరుణింతుగాక॥కొంక॥
  
  
చుట్టాలమౌదుము గాక సూడుబంట్లమా నేము
రట్టేల మమ్ముఁ జేసేవు ఇట్టె రతివేళను
గుట్టుతో శ్రీ వేంకటేశ కూడితి మిందరమును
వొట్టుక మావద్దఁ బాయకుండుదువుగాక॥కొంక॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!