Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7146

కొంచెమును ఘనముఁ గనుఁగొననేల హరిఁ దలఁచు-

రాగము: శ్రీరాగం

కొంచెమును ఘనముఁ గనుఁగొననేల హరిఁ దలఁచు-
పంచమహాపాతకుఁడే బ్రాహ్మణోత్తముఁడు॥పల్లవి॥
  
  
వేదములుచదివియును విముఖుఁడై హరికథల
నాదరించనిసోమయాజికంటె
యేదియునులేనికులహీనుఁడైనను విష్ణు
పాదసేవకుఁడువో బ్రహ్మణోత్తముఁడు॥కొంచె॥
  
  
పరమమగువేదాంతపఠన దొరకియు సదా
హరిఁదలఁచలేని సన్న్యాసికంటె
మరిగి పసురముఁదినెడిమాలయైనను వాఁడె
పరమాత్ముఁ గొలిచినను బ్రహ్మణోత్తముఁడు॥కొంచె॥
  
  
వినియుఁ జదివియు రమావిభునిఁ దలఁపక వృథా
తనువు వేఁపుచుఁ దిరుగతపసికంటె
చనవుగల వేంకటేశ్వరుదాసులకు వెంటఁ
బనిదిరుగునధముఁడే బ్రహ్మణోత్తముఁడు॥కొంచె॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!