Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7163

కొంత నిలుపఁగరాదు కొంచేవు వొక్కమారే

రాగము: మాళవిగౌళ

కొంత నిలుపఁగరాదు కొంచేవు వొక్కమారే
యిఁ(యిం?)తాఁ దీరిన మరి యేమిసేసేవే॥పల్లవి॥
  
  
కొప్పు వీడినదాఁకా కుచము లదరుదాఁకా
యిప్పుడే అంత నీవు యేలనవ్వేవే
రెప్పలణఁచినదాఁకా రేవులురేవులుగాను
అప్పటిఁ దప్పక నన్ను అదేల చూచేవే॥కొంత॥
  
  
పెదవు లెండినదాఁకా చెదరేయేలుఁగుదాఁకా
మదముదొలఁక నేల మాఁటలాడేవే
నిదుర ముంచినదాఁకా నివ్వెరగందినదాఁకా
సదమదమై యేల సరసమాడేవే॥కొంత॥
  
  
నిండాఁ జెమరించుదాఁకా నిట్టూర్పు రేఁగిఁనదాఁకా
అండనే రతులనేల అలఇంచేవే
పండినశ్రీవేంకటాద్రిపతి నేనే కూడితిని
పండే మంచ మెక్కేదాఁకా పదరనేమిటికే॥కొంత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!