Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7171

కోటిమన్మథాకార గోవింద కృష్ణ

రాగము: పాడి

కోటిమన్మథాకార గోవింద కృష్ణ
పాటించి నీమహిమలే పరబ్రహ్మమాయ॥పల్లవి॥
  
  
ఆకాశమువంటిమేను నమరేమూర్తివి గాన
ఆకాశనదియె నీకు నభిషేకము
మేకొని నీవే నిండుమేఘవర్ణు డవు గాన
నీకు మేఘపుష్పాలే పన్నీరుకాపు॥కోటి॥
  
  
చంద్రుఁడు నీమనసులో జనియించె నటుగాన
చంద్రికలు కప్రకాపై సరి నిండెను
యింద్రనీలపుగనులు యిలధరుఁడవు గాన
తంద్ర లేక యాపె చూపే తట్టుపుణుఁ గాయను॥కోటి॥
  
  
లక్ష్మీపతివి గాన లాగుల నీ వురముపై
లక్ష్మి యలమేలుమంగే లలి నీతాళి
సూక్ష్మమై శ్రీవేంకటేశ చుక్కలపొడవు గాఁగ
పక్ష్మనక్షత్రములే యాభరణహరములు॥కోటి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!