Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7201
కోరిన కోరిక లిట్టె కొనసాగక మానవు
రాగము: రీతిగౌళ
కోరిన కోరిక లిట్టె కొనసాగక మానవు | |
నేరుపులెల్లా నేడే నించవలెఁగాని | ॥పల్లవి॥ |
పొలఁతులెదుట నీవు పొద్దు వోనిమాట లాడి | |
వలపులు రేఁచితివి వాఁటముగాను | |
తలవంచుకొని ఇఁకఁ దప్పించుకొంటేఁ బోదు | |
వెలయ రతుల విఱ్ఱవీఁగ వలెఁగాని | ॥కోరి॥ |
సిగ్గువడేవారిఁ వద్ద జేయరానిచేఁత సేసి | |
వెగ్గళము నవ్వతివి వేడుకగాను | |
బగ్గన నింతటిమీఁదఁ బరాకుసేయఁగరాదు | |
కగ్గులేక రతి కొడిగట్టవలెఁగాని | ॥కోరి॥ |
చెలికత్తియలతోడఁ జేరి యేకతములాడి | |
చిలికితివి యాసలు శ్రీవేంకటేశ | |
అలమేలుమంగ నేలి తౌఁగాదనఁగరాదు | |
యలమి రతికిఁ జనవియ్యవలెఁగాని | ॥కోరి॥ |
కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు