Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7237

కంటినంటే పలుమారు గరిసించేవు

రాగము: ద్రావిళభైరవి

కంటినంటే పలుమారు గరిసించేవు
వొంటినున్నవారి నంత వొరయఁగ వచ్చునా॥పల్లవి॥
  
  
వొప్పుగా నెవ్వతెనో కూడుంటివని యంటేను
అప్పటి నీవేడనుంటి వనెడిగేవు
అప్పటిమాటలు వింటినంటేఁ జెప్పుమాయనేవు
చెప్పరాని సుద్దులవి చెప్పవచ్చునా॥కంటి॥
  
  
నలిరేఁగి పకపక నవ్వితిరిగా యంటేను
అలరి యెట్టుదెలిసె ననెడిగేవు
చెలఁగి మీచేఁతలు చూచితినంటే నడిగేవు
సొలసి మర్మములవి చూపవచ్చునా॥కంటి॥
  
  
శ్రీవేంకటేశుఁడ కలిసితివిగా యనెంటేను
ఆవిధాన నన్నుఁ గూడి అదెడిగేవు
చేవదేర రతులు మెచ్చితినంటేఁ గొసరేవు
ఆవేళ సుద్దులవి యీవేళ వచ్చునా॥కంటి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!