Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7240

కంటిమమ్మ యిన్నాళ్లకు కతలుగా మీ సుద్దులు

రాగము: ధన్నాసి

కంటిమమ్మ యిన్నాళ్లకు కతలుగా మీ సుద్దులు
జంటలైన ఇటువంటి చనవు గలిగెనా॥పల్లవి॥
  
  
చేయిమీఁదఁ జేయివేసి చెక్కునొక్కేవు విభుని
చాయల నాతఁ డింతేసి చనవిచ్చెనా
ఆయములంటి యాతని నప్పటి గొరనూఁదేవు
పాయక ఇద్దరికిని పాటి(త)చుట్టరికమా॥॥
  
  
మంతనాన నాతనిని మాటలోనే తిప్పేవు
పంతన నీకిటువంటిబాస సేసెనా
బంతినే మీపై మీరు పాదాలు చాఁచుకొనేరు
సంతతము మీ కిట్టిసంగాతాలా॥॥
  
  
చేరి శ్రీ వేంకటేశ్వరు చెలరేఁగి కూడేవు
నేరుపు లీతఁ డిన్నేసి నీకు నేర్పెనా
యీరీతిఁ దా నన్ను నేలె ఇందుకే నీవు మెచ్చేవు
కారణాలు మీకు మీకుఁ గలిగినవా॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!