Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7250

కంటిమిగా యివి గొన్ని కారణాలు నీవల్ల

రాగము: దేశాక్షి

కంటిమిగా యివి గొన్ని కారణాలు నీవల్ల
వింటిమి నిన్నా మొన్నా వేడుకాయ నేఁడు॥పల్లవి॥
  
వల్లెవాటుఁ బయ్యదతో వచ్చి యాపె నిలుచుండి
పల్లదపు మాటలాడీఁ బచ్చిగా నిన్ను
కల్లలంటా నుంటిమి నీకతలు యిన్నాళ్ళదాఁకా
వెల్లవిరులుగాఁ జూచి వెరగాయ నేఁడు॥॥
  
వుద్ధాలు మెట్టుక వచ్చి వురుపుఁ జూపులఁ జూచి
వుద్దండపుఁ జేఁత సేసి వొరసీ నిన్ను
సుద్దులే యంటా నుంటిమి చొక్కపు నీ మహిమలు
అద్దుక నీగుట్టెఱిఁగి అరుదాయ నేఁడు॥॥
  
పుక్కిటి వీడెముతోడ పొందుల నీతొడ యెక్కి
మిక్కిలి కాఁగిటఁ గూడీ మేలుతో నిన్ను
తక్కులంటా నుంటిమి యిందాఁకా శ్రీవేంకటేశ
యిక్కువ నన్నేలితివి యిరవాయ నేఁడు॥॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!