Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7271

కంటిమి నేఁ డీకొత్తలు కన్నుల పండుగలాయ

రాగము: రామక్రియ

కంటిమి నేఁ డీకొత్తలు కన్నుల పండుగలాయ
జంటలైన మీలోని జాణతనా లెట్టివో॥పల్లవి॥
  
  
కోమలపు నీకాంత గుబ్బలపై మెఱుఁగులు
మోమున నీకు గళలై ముంచుకొన్నవి
యేమి సూత్రమోకాని ఇందుకునందుకు నేఁడు
తామర మొగ్గల సొంపద్దముపై నిలిచెను॥కంటి॥
  
  
కడు మంచి జవరాల కనుగవతేటలు నడుమ
నడుమ మోవిమీఁద నవ్వులాయను
యెడయక యీరెంటికి నేమిగారణమోకాని
అడరి కలువలనిగ్గంటెఁ జిగురులను॥కంటి॥
  
  
అలమేలుమంగ నీయండఁ బాయకుండితేను
నెలవై శ్రీవేంకటేశ నీవు గూడితి
యెలిమి నాపై నీకు నెన్నటి పొందోకాని
కలసి మెఱుఁగుదీవె కల్పకముఁజెందెను॥కంటి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!