Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7287

కంటిమి వింటిమి మీ కతలెల్లాను

రాగము: పాడి

కంటిమి వింటిమి మీ కతలెల్లాను
జంటలై మీ కోరికలు సాదించుకోరాదా॥పల్లవి॥
  
  
చెలిమి సేసినవారు సిగ్గులు వడ నేఁటికి
నలిరేఁగి వేడుకతో నవ్వుట గాక
మొలచిన వలపులు మూసి దాఁచ నేమిటికి
చెలరేఁగి వెల్లవిరి సేసుకొనరాదా॥కంటి॥
  
  
ఆస గలిగినవారు నుమానించ నేఁటికి
తాసువలెఁ గూడి మాడి దక్కుటగాక
సేసవెట్టి పెండ్లాడుతూ శిరసు వంచ నేఁటికి
పోసరించి వెరవక భోగించరాదా॥కంటి॥
  
  
చనవు గలుగువారు జడియఁగ నేమిటికి
పెనఁగి రతులు పైపైఁ బెంచుటగాక
యెనసితివి శ్రీవేంకటేశ యలమేల్మంగను
నను వలెనే యాకెతో నంటు సేయరాదా॥కంటి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!