Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7407

గుట్టుతోడి నీవు నన్ను గొరబుసేయకువయ్య

రాగము: పాడి

గుట్టుతోడి నీవు నన్ను గొరబుసేయకువయ్య
వుట్టిపడి నాతో నవ్వనోపుదువా॥పల్లవి॥
  
  
ఆయములు సోఁక నీతో నాడుకొనఁజాలఁగాక
పాయపునీయాలఁగానా పరాకేఁటికి
చేయిచాఁచ కిటు నీతో సిగ్గువడి వుందానగా-
కోయినీవు నాతో సంతకోపుదువా॥గుట్టు॥
  
  
కన్నుల జంకించి నిన్ను కక్కసించఁజాలఁగాక
మన్నించేదానఁగాన మాయలేఁటికి
చన్నుల నే నొత్తి నీతో సరసములాడఁగాక
వున్నపనుల కంతేసి కోపుదువా॥గుట్టు॥
  
  
తేనెగారేమోవి ఇచ్చి తిట్టు దిట్టఁజాలఁగాక
మేనదానఁగాన నాతో మేకులేఁటికి
యీనెపాన శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
పూనిననారతులకు వోపుదువా॥గుట్టు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!