Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7434

గుఱిగా శ్రీ కృష్ణుఁడు మనకు దొర దూరువాఁడు

రాగము: లలిత

గుఱిగా శ్రీ కృష్ణుఁడు మనకు దొర దూరువాఁడు
వెఱవక చేతికొద్ది వెఱఁజరో మీరు॥పల్లవి॥
  
  
పెట్టిరి గొల్లెతలెల్ల పెరుగు నెయ్యి వుట్ల
కొట్టరో కొట్టరో మీరు కోలలవారు
తిట్టేరు వారిల్లదివో తెగి దగ్గరకతొల్లె
పట్టరో వారలు మీరు పైఁగారేపాలు॥॥
  
  
యెంచి పెట్టిరి దొంతుల నేడలేనిచక్కిలాలు
దించరో కుండలతోనే దిగువకును
పెంచులయినదాఁకా పెనఁగేరు మనతోడ
తుంచి నోరవేసుకొని తొలఁగరో మీరు॥॥
  
  
తక్కక యడుకులెల్లా దాఁచిరి తమసొమ్మంటా
చిక్కెఁ జిక్కెఁ దీసుకోరో నేన వున్నవి
యెక్కెను శ్రీ వేంకటాద్రి ఇదివో మనకృష్ణుఁడు
చక్కనాయఁ బనులెల్లాఁ జాలించి రారో॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!