Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7493

ఘోరదురితములచే గుణవికారములచే-

రాగము: ధన్నాసి

ఘోరదురితములచే గుణవికారములచే-
నిరితిఁ బడు నాకు నేది దెరువు॥పల్లవి॥
  
  
హరి జగన్నాథు లోకరాధ్యు-
నెరఁగనేరనివాని కేది దెరువు
పరమపురుషుని జగద్భరితు నంతర్వ్యాప్తి-
నిరవుకొలుపనివాని కేది దెరువు॥ఘెర॥
  
  
శ్రీ వేంకటేశుఁ దలఁచినవెనక సకలంబు ...
నేవగింపనివారి కేది దెరువు
దేవోత్తముని మహిమ దెలిసితెలియఁగలేని-
యీవివేకంబునకు నేది దెరువు॥ఘెర॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!