Bhimalapuram.co.in

సంగీతము/గాత్రము/గానము -- ఉచిత పరికరము

ఆంగ్లము తెలుగులిపిలేదు

ఆగ్(ogg): ఇది ఉచితముగ లభించు పరికరము. సామాన్య రూపము (Normal format - wav file }గల ఒక గాత్ర సంపుటము(Audio file)ను ఆగ్ రూపములో - తరచుగ 110వంతు సంక్షిప్తము చేయ గలము. మా అభిప్రాయమున -ఎంపీ3 కంటే ఉన్నతమైనది.

  1. ఒక ఉపకరణము నుండి ఇంకొక ఉపకరణమునకు ఎన్ని సారులు మార్చిన -ధ్వనిలో క్షీణత-తేడా రాదు.
  2. కల్పించునప్పుడు,ఎగుమతి-దిగుమతి చేసుకొనినప్పుడు, సవరణలు చేయునప్పుడు,వినునప్పుడు ఎంపీ3, wavలందు కలుగు ఇబ్బందులు,లోపములు ఇందులో రావు.

సంక్షిప్తము చేయునప్పుడు మన (మానవ) చెవులకు వినబడని ధ్వని బాగములే తొలగింప పడును. కనుక వినుటలో ఎటువంటి లోపము(loss of quality)వుండదు. ఇది నష్టముతో కూడిన రూపము lossy format అనబడును.

ఫ్‌ళాక్:(Flac): ఇదియు ఉచితముగ లభించు పరికరము. సామాన్య రూపము (Normal format - wav file)గల ఒక గాత్ర సంపుటము(Audio file)ను సుమారు ½ నకు తగ్గించును.కాని శబ్దమున ఏ భాగములు తొలగింప పడవు. కనుక ఇది నష్టములేని lossless format రూపము అనబడును.

పీడీఎఫ్ - పోర్టబ్‌ల్ డాకుమెన్‌ట్ ఫార్‌మాట్ :(PDF) పోర్టబ్ల్ దాకుమెంట్ ఫర్‌మాట్- దీనితో పత్రములు/బొమ్మలు/పట్టికలు - అన్నింటిని ఎక్కడికైన ఇబ్బంది లేకుంద మార్చు కొనవచ్చును. అంటే పరికర యంత్రములకు అతీతమైనది (Platform independent). ఎటువంటి పరికరమునుండి (from any system or machine) ఎటువంటి పరికరమునైక (to any operating system or machine) మార్చుకొన -ఎగుమతి/దిగుమతి చేసుకొన గలము.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!