Bhimalapuram.co.in
కీర్తనలు

ఆంగ్లము తెలుగులిపిలేదు

అన్నమాచార్యులు రచించిన కీర్తనలలో 15000 కీర్తనలను ప్రచురించు ఈ భగీరథ ప్రయత్నము స్వేఛ్చగ/ఉచితముగ లభించు లైనక్‌స్, లైనక్‌స్‌లోని మైఎస్‌క్యూఎల్‌, సెడ్, ఆక్, అపాచీ వెబ్ సెర్వర్, లైనక్‌స్‌లోని పరికరములు, బాష్/ఇతర సూత్రములు, స్‌క్రిప్‌ట్(Script), జీజిప్, టార్, అడాసిటి, ఆగ్గ్/ఫ్లాక్, టెక్‌స్ వంటి మహోన్నతమైన పరికరములు దొరకుటచేతనే సాధ్యమైనది. స్వల్ప వ్యయముతో - వాణిజ్య ప్రకటనలు లేకుండ ఉచిత దిగుమతికి పురాతన సంపదలను అందచేయ గలుగుట ఉచిత/స్వేచ్ఛ పరికరములు-వసతులు (free software,utilities) లభించుటచే సాధ్యమైనది. మేము సేకరించిన గ్రంధములు/పత్రములు/గాత్ర సంపుటముల నిబంధనలు(terms of license) చాలవఱకు స్పష్టముగ లేవు. వీటి గురించి స్పష్టత లేక అవసరమైన అనుమతులు దొరిన తరువాత ఈ విభాగము విస్తరింపబడును.

కీర్తనలు దిగుమతి/ఉపయోగముల సౌలభ్యత కొఱకు హెచ్‌టీఎంఎల్ దస్త్రములుగ - తెలుగు లిపిలో ఇవ్వబడినవి. తెలుగు లిపిననుసరించి క్రోడికరింపబడినవి. వీటిని గ్ను జీపీ్ఎల్ 2షరత్తులననుసరించి దిగుమతి చేసుకొనవచ్చును.

అన్నమాచార్య కృతులు: ఇక్కడ దిగుమతికి లభించు సు||15000 కీర్తనలను ఈ పట్టిక ద్వార వీక్షింపవచ్చును/దిగుమతి చేసుకొనవచ్చును.

త్యాగరాజు రచించిన కీర్తనలు: ఈ సూచికను ఉపయోగించి కావసిన కీర్తనలను ఎన్నుకొనవచ్చును.

ఇతరులు: శ్యామ శాస్త్రి - త్యాగరాజు సమకాలికులు. శ్యామ శాస్త్రి కీర్తనలు (తెలుగులోనివి మాత్రము)ఇక్కడ ఇవ్వబడినవి.

ఇతరులు: "భక్త రామదాసు" అని ప్రసిద్ధి చెందిన కంచెర్ల గోపన్న కీర్తనలు ఇక్కడ ఇవ్వబడినవి.

ఈ కీర్తనల గాత్ర సంపుటములను క్రమముగ ఆగ్గ్ రూపమున ప్రచురింపవలెనని మా సంకల్పము.

అన్నమాచార్యుల సు|| 32000 కీర్తనలు రచించినట్టు తెలియుచున్నదు. కాని అన్ని కీర్తనలు దొరకుట లేదు. మాకు లభించిన కీర్తనలు (అన్నమాచార్యులు- సు||15000 +త్యాగరాజు/ఇతరులు -900) లైనక్‌స్‌లో గల లిప్యంతరీకరణ విధానములతో (RTS) సమకూర్చబడినవి. తెలుగేరతభాషలో వ్యవహరించుటచే (processing in nonTelugu -English-language)వత్తులు(బ-భ,ద-ధ)/బిందు/అర్ధబిందు వాడకములో కొన్ని పొరపాట్లు సవరింపబడకుండ ఉండవచ్చును. అటువంటి పొరపాట్లను మాకు తెలుప వలెనని మా మనవి. మాకు తెలిపినచో వాటిని సవరించెదము. మా చిరునామా: gbsubrahmanyamATgmailDOTcom

Valid XHTML 1.0 Transitional

Valid CSS!