Bhimalapuram.co.in
కరుణానిధి

రాగము: తోడి తాళము: ఆది

పల్లవి
కరుణా నిధి ఇలలో నీవనుచును
కన్న తల్లి వేడుకొంటిని నీ శరణంటిని
అనుపల్లవి
అరుణాంబుద నిభ చరణా సుర ముని
శరణానంతేష్ట దాయకి శ్రీ బృహన్నాయకి ||కరుణా||
చరణం 1
గాన వినోదిని నీ మహిమాతిశయంబుల
ఎంతటివాడను తరమా బ్రోవ
తాళముమసమిటు జేసితే అర నిమిషమైన
తాళముళ జాలనమ్మా మాయమ్మా ||కరుణా||
చరణం 2
పామర పాలిని పావని నీవు గదా నీ
పాదమే గతియని నమ్మినాను
కోమళ మృదు భాషిణీ ఘన సదృశ వేణీ
శ్యామ కృష్ణ సోదరీ గోకర్ణేశ్వరుని రాగముణి ||కరుణా||

విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!