Bhimalapuram.co.in
శ్రీ కామాక్షీ కావవే

రాగము:000 తాళము:000

పల్లవి
శ్రీ కామాక్షీ కావవే నను కరుణా కటాక్షి
శ్రీ కాంతిమతీ శ్రీ కాంచీ పుర వాసిని
అనుపల్లవి
ఏకామ్రేశ్వరీ నీకు ఏలాగు దయ వచ్చునో
లోకులు కోరిన దైవము నీవే గాదా
ఏక భావుడైన నన్నొకని బ్రోవ బరువా ||(శ్రీ)||
చరణం 1
కోరి వచ్చిన భక్త జనులకు
కోమళాంగీ నీవే సామ్రాగముజ్యము
కామాక్షమ్మా నిన్నే వేడిన బిడ్డను
కాపాడవమ్మా కరుణ జూడవమ్మా
సారస దళ నేత్రీ కామ పాలినీ
సోమ శేఖరుని రాగముణీ పురాగముణీ
శ్యామళాంబికే కాళికే కలే
సామ గాన మోదినీ జననీ ||(శ్రీ)||
చరణం 2
నీరజ లోచనా స్థిరమని భక్తితో
నిన్నే శరణంటిన దాసుడు నేను
నీ సన్నిధిని జేరిన నాపై
నిరీక్షణము చేయ తగునా
నీ నామ ధ్యానమే నియతి వేరే
జప తపములెరుగనే మాయమ్మా
నీ సాటెవరు శ్యామళే శివే
శ్యామ కృష్ణ పాలిత జననీ ||(శ్రీ)||
స్వర సాహిత్య
నా మనవి వినుమిక గిరి
తనయా ముదముతో వచ్చి కోరితి
నా వెతలను దీర్చవే మాకభయ
దానమీయవే తాళముమసము సేయకనే ||(శ్రీ)||

విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!