Bhimalapuram co in

గజేంద్ర మోక్షము

సంక్షిప్తరూపము

వ. చతుర్థ మనువు కాలప్రసంగంబు వివరించెద. 1

వ. ఇవ్విధంబునఁ బ్రాయోపవిష్టుండైన పరీక్షన్నరేంద్రుండు బాదరాయణి నడిగె. అని చెప్పి, సభాసదులైన మునుల నవలోకించి, సూతుండు పరమ హర్షసమేతుండై చెప్పె. అట్లు శుకుండు రాజున కిట్లనియె. 6

వ. అది మఱియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ భల్లాత కామ్రాతక సరళ పనస బదరీ వకుళ వంజుళ వట కుటజ కుంద కురువక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సిందువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవీ మధూక తాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీ కపిత్థ కాంచన కందరాళ శిరీష శింశుపాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర వసంతసమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు న్నివహా లంకృతంబును, మణివాలు కానేక విమల పులిన తరంగిణీ సంగత విచిత్ర విద్రుమలతా మహోద్యాన శుక పిక నికర నిశిత సమంచిత చంచూపుట నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫల రంధ్ర ప్రవర్షిత రసప్రవాహ బహుళంబును, కనకమయ సలిల కాసార కాంచన కుముద కల్హార కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విట సముదయ సమీపసంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జలకుక్కుట చక్రవాక బలాహక కోయష్టిక ముఖర జలవిహంగ విసర వివిధకోలాహల బధిరీభూత భూ నభోంతరాళంబును, తుహినకరకాంత మరకత కమలరాగ వజ్ర వైఢూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కలధౌత మణిమయానేక శిఖరితట దరీ విహరమాణ విద్యాధర విబుధ సిద్ధ చారణ గంధర్వ గరుడ కిన్నర కింపురుష మిధున సంతత సరససల్లాప సంగీతప్రసంగ మంగళాయతనంబును, గంధగజ గవయ గండభేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల చమర శల్య భల్ల సారంగ సాలావృక వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమరసన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమనకింకరంబునునై యొప్పు నప్పర్వత సమీపంబునందు. 8

వ. అప్పుడు. 18

వ. ఇట్లు వెనుక ముందఱ నడుమ నుభయపార్శ్వంబులఁ దృషార్దితంబులై యరుగు దెంచు నేనుంగుగములం గానక తెఱంగుదప్పి తొలంగుడుపడి, యీశ్వరాయత్తంబైన చిత్తంబు సంవిత్తంబు గాకుండుటంజేసి తానును, దన కరేణు సముదయంబును నొక్క తెరువై పోవుచు. 22

వ. మఱియు నానా గహనవిహరణ మహిమతో మదగజేంద్రంబు మార్గంబుఁ దప్పి, పిపాసా పరాయత్త చిత్తంబున మత్తకరేణువుల మొత్తంబునుం దానును జని చని. 25

వ. ఇట్లనన్య పురుషసంచారంబును, నిష్కళంకంబును నైన యప్పంకజాకరంబుఁ బొడగని. 27

వ. అప్పుడు. 30

వ. మఱియును, నగ్గజేంద్రం బనర్గళ విహారంబున. 32

వ. మఱియు, నా సరోవరలక్ష్మి మదగజేంద్ర వివిధ విహార వ్యాకులిత నూతన లక్ష్మీవిభవయై, యనంగవిద్యా నిరూఢ పల్లవప్రబంధ పరికంపిత శరీరాలంకార యగు కుసుమకోమలియునుం బోలె, వ్యాకీర్ణ చికుర మత్తమధుకర నికరయు, విగతరస వదనకమలయు, నిజస్థాన చలిత కుచ రథాంగయుగళ లంపటిత జఘన పులినతలయునై యుండె. అంత. 34

వ. ఇట్లు కరిమకరంబులు రెండును నొండొండ సముద్దండ దండంబులై తలపడి, నిఖిల లోకాలోకన భీకరంబులై, యన్యోన్య విజయశ్రీ వశీకరంబులై, సంక్షోభిత కమలాకరంబులై, హరి హరియును, గిరి గిరియునుం దాఁకి, పిఱుతివియక పెనంగు తెఱంగున, నీరాటంబైన పోరాటంబునఁ బట్టుచు వెలికి లోనికిం దిగుచుచుఁ, గొలంకు కలంకం బందఁ, గడువడి నిట్టట్టుపడి, తడఁబడక, బుడబుడానుకారంబులై, భుగులు భుగుల్లను చప్పుళ్లతో నురువులు గట్టుచు, జలంబు లుప్పరంబున కెగయం జప్పరింపుచుఁ, దప్పక వదనగహ్వరంబుల నప్పళింపుచు, నిశిత నితాంత దురంత దంతకుంతంబుల నింతింతలు దునియలై, నెప్పళంబునం బునుకచిప్పలు కుదుళ్లుదప్పి రక్తంబులు గ్రమ్ముదేర, హు మ్మని యొక్కుమ్మడిం జిమ్ముచు, నితరేతర సమాకర్షణంబులం గదలక, పదంబులు మొదలిపట్టు వదలక, కుదురై యుండుచుఁ, బరిభ్రమణ వేగంబున జలంబులం దిరుగుచు, మకర కమఠ కర్కట గండక మండూకాది సలిలనిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా, నొకటొకటిం దాఁకు రభసంబున నిక్కలువడ మ్రక్కం ద్రొక్కుచు, మెండుచెడి, బెండువడి, నాఁచు గుల్లచిప్ప తండంబులం బరస్పర తాడనంబులకు నడ్డంబుగా నొడ్డుచు, నోల మాసగొనక, గెలుపుఁదలంపులు బెట్టిదంబులై రెట్టింప, నహోరాత్రంబులుం బోలెఁ గ్రమక్రమ విజృంభమాణంబులై, బహుకాల కలహ విహారంబులై, నిర్గత నిద్రాహారంబులై, యవక్ర పరాక్రమ ఘోరంబులై, పోరుచున్న సమయంబున. 39

వ. అప్పుడు. 42

వ. అంత. 44

వ. ఇట్లు విస్మిత నక్రచక్రంబై, నిర్వక్ర విక్రమంబున, నల్ప హృదయ జ్ఞానదీపంబు నతిక్రమించు మహా మాయాంధకారంబునుం బోలె, నంతకంతకు నుత్సాహ కలహ సన్నాహ బహువిధ జలావగాహంబైన గ్రాహంబును మహాసాహసంబున. 48

వ. ఇవ్విధంబున. 52

వ. మఱియును. 66

వ. అని మఱియు నిట్లని వితర్కించె. 68

వ. అని పలికి, తన మనంబున నగ్గజేంద్రుం డీశ్వర సన్నిధానంబుఁ గల్పించుకొని యిట్లనియె. 73

వ. అని పలికి, మఱియు నరక్షిత రక్షకుండైన యీశ్వరుం డాపన్నుండైన నన్నుం గాచుఁ గాక యని, నింగి నిక్కి చూచుచు, నిట్టూర్పులు నిగిడింపుచు, బయ లాలకింపుచు, నగ్గజేంద్రుండు మొఱ సేయుచున్న సమయంబున, 77

వ. ఇట్లు భక్తజనపాలన పరాయణుండును, నిఖిల జంతు హృదయారవింద సదన సంస్థితుండును నగు నారాయణుండు, కరికులేంద్ర విజ్ఞాపిత నానావిధ దీనాలాపంబు లాకర్ణించి, లక్ష్మీకాంతా వినోదంబులం దనివి సాలించి, సంభ్రమించి, దిశలు నిరీక్షించి, గజేంద్ర రక్షాపరత్వంబు నంగీకరించి, నిజ పరికరంబును మరల నవధరించి, గగనంబున కుద్గమించి, వేంచేయు నప్పుడు. 81

వ. తదనంతరంబ ముఖారవింద మకరంద బిందుసందోహ పరిష్యందమా నానంద దిందిందిర యగు నయ్యిందిరాదేవి, గోవింద కరారవింద సమాకృష్యమాణ సంవాద చేలాంచలయై పోవుచు. 83

వ. అని వితర్కింపుచు. 85

వ. ఇట్లు పొడగని. 90

వ. అయ్యవసరంబునఁ గుంజరేంద్రపాలన పారవశ్యంబున దేవతానమస్కారంబు లంగీకరింపక, మనస్సమాన సంచారుండై, పోయి పోయి, కొంతదూరంబున శింశుమార చక్రంబునుంబోలె గురు మకర కుళీర మీన మిథునంబై, కిన్న రేంద్రుని భాండాగారంబునుంబోలె స్వచ్ఛ వర కచ్ఛపంబై, భాగ్యవంతుని భాగధేయంబునుం బోలె సరాగ జీవనంబై, వైకుంఠపురంబునుంబోలె శంఖ చక్ర కమలాలంకృతంబై, సంసారచక్రంబునుంబోలె ద్వంద్వ సంకుల పంక సంకీర్ణంబై యొప్పు నప్పంకజాకరంబుఁ బొడగని. 92

వ. ఇట్లు పంచిన. 94

వ. ఇట్లు నిమిషస్పర్శంబున సుదర్శనంబు మకరి తల ద్రుంచు నవసరంబున. 97

వ. అప్పుడు జగజ్జనకుండగు నప్పరమేశ్వరుండు దరహసిత ముఖకమల యగు నక్కమల కిట్లనియె. 112

వ. అని పలికిన, నరవింద మందిర యగు నయ్యిందిరాదేవి మందస్మిత చంద్రికా వదనారవింద యగుచు ముకుందున కిట్లనియె. 115

వ. అని మఱియును, సముచిత సంభాషణంబుల నంకించుచున్న పరమ వైష్ణవీరత్నంబును సాదర సరస సల్లాప మందహాస పూర్వకంబుగా నాలింగనంబు గావించి, సపరివారుండై, గంధర్వ సిద్ధ విబుధగణ జేగీయమానుండై, గరుడారూఢుండగుచు, నిజసదనంబునకుం జనియె. అని చెప్పి శుక యోగీంద్రుండిట్లనియె. 118

వ. అని మఱియు, నప్పరమేశ్వరుండిట్లని యానతిచ్చె. ఎవ్వరేనియు నపరరాత్రంబున మేల్కాంచి, సమాహిత మనస్కులై, శ్వేతద్వీపంబును, నాకుం బ్రియంబైన సుధాసాగరంబును, హేమనగరంబును, నిగ్గిరికందర కాననంబులను, వేత్ర కీచక వేణులతా గుల్మ సురపాదపంబులను, ఏనును బ్రహ్మయు ఫాలలోచనుండును నివసించి యుండు నక్కొండశిఖరంబులను, కౌమోదకీ కౌస్తుభ సుదర్శన పాంచజన్యంబులను, శ్రీదేవిని, శేష గరుడ వాసుకి ప్రహ్లాద నారదాది ఋషులను, మత్స్య కూర్మ వరాహాద్యవతారంబులను, దదవతారకృత కార్యంబులను, సూర్య సోమ పావకులనుఁ, బ్రణవంబును, ధర్మ తప స్సత్యంబులను, వేదంబును, వేదాంగంబులను, శాస్త్రంబులను, గో భూసుర సాధు పతివ్రతాజనంబులను, జంద్రకాశ్యపజాయా సముదయంబును, గౌరీ గంగా సరస్వతీ కాళిందీ సునందా ప్రముఖ పుణ్యతరంగిణీ నిచయంబును, నమరులను, నమరతరువులను, నైరావతంబును, నమృతంబును, ధ్రువుని, బ్రహ్మర్షి నివహంబును, బుణ్యశ్లోకులైన మానవులను, సమాహిత చిత్తులై తలంచువారలకుఁ బ్రాణావసానకాలంబున మదీయంబగు విమలగతి నిత్తు. అని హృషీకేశుండు నిర్దేశించి, శంఖంబు పూరించి, విహగపరివృఢ వాహనుండై వేంచేసె. విబుధానీకంబు సంతోషించె. అని చెప్పి శుకుండు రాజున కిట్లనియె. 120

Valid XHTML 1.0 Transitional

Valid CSS!