Bhimalapuram co in

సంక్షిప్తరూపము

రుక్మిణీకల్యాణము

వ. తదనంతరంబున. 2

వ. అనిన రా జిట్లనియె. మున్ను రాక్షస వివాహంబున స్వయంవరంబునకు వచ్చి, హరి రుక్మిణిం గొనిపోయె నని పలికితివి. కృష్ణుం డొక్కరుం డెవ్విధంబున సాళ్వాదులం జయించి, తన పురంబునకుం జనియె? అదియునుం గాక. 4

వ. అని, రా జడిగిన శుకుం డిట్లనియె. 7

వ. మఱియును, దినదిన ప్రవర్ధమాన యై. 10

వ. అంత. 12

వ. ఇట్లు రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మమాలి యను నేవురకుం జెలియ లైన రుక్మిణీదేవి దన యెలప్రాయంబున. 14

వ. అంత. 17

వ. అని కొన్ని రహస్యవచనంబులు సెప్పిన విని బ్రాహ్మణుండు ద్వారకానగరంబు నకుం జని, ప్రతీహారులవలనఁ దనరాక నెఱింగించి, య న్నగధరుం డున్న నగరుఁ బ్రవేశించి, యందుఁ గనకాసనాసీనుండైయున్న పురుషోత్తముం గాంచి, పెండ్లికొడుకవు గమ్మని దీవించిన, ముసిముసినగవులు నగుచు, బ్రహ్మణ్య దేవుండైన హరి, తన గద్దియ దిగ్గన డిగ్గి, బ్రాహ్మణుం గూర్చుండ నియోగించి, తనకు దేవతలు సేయు చందంబునం బూజలు సేసి, సరస పదార్థ సంపన్నం బైన యన్నంబు పెట్టించి, రెట్టించిన ప్రియంబున నయంబున భాసురుండైన భూసురుం జేరి, లోకరక్షణ ప్రశస్తం బైన హస్తంబున నతని యడుగులు పుడుకుచు, మెల్లన నతని కి ట్లనియె. 21

వ. అని యిట్లు లీలా గృహీతశరీరుం డైన య ప్పరమేశ్వరుం డడిగిన, ధరణీసుర వరుం డతని కిట్లనియె. దేవా! విదర్భదేశాధీశ్వరుం డగు భీష్మకుం డను రాజు గలండు. ఆ రాజుకూఁతురు రుక్మిణి యను కన్యకామణి గలదు. అ య్యిందువదన నీకుం గైంకర్యంబు సేయం గోరి, వివాహమంగళ ప్రశస్తం బైన యొక్క సందేశంబు విన్నవింపు మని పుత్తెంచె. అవధరింపుము. 24

వ. అని యిట్లు రుక్మిణీ దేవి పుత్తెంచిన సందేశంబును, రూప సౌందర్యాతి విశేషంబు లును, బ్రాహ్మణుండు హరికి విన్నవించి, కర్తవ్యం బెద్ది సేయ నవధరింపు మని, సవరణగా ని ట్లనియె. 33

వ. అని యిట్లు పలికిన బ్రాహ్మణునివలన విదర్భరాజతనయ పుత్తెంచిన సందేశం బును, రూప సౌందర్యాది విశేషంబులును విని, యవధరించి, నిజకరంబున నతని కరంబుఁ బట్టి నగుచు, న య్యాదవేంద్రుం డి ట్లనియె. 36

వ. అని పలికి రుక్మిణీదేవి పెండ్లి నక్షత్రంబు తెలిసి, తన పంపున రథ సారథి యైన దారుకుండు శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకంబు లను తురంగంబులం గట్టి, రథ మాయత్తంబు చేసి తెచ్చిన, నమోఘ మనోరథుం డైన హరి తానును, బ్రాహ్మణుండును, రథారోహణంబు సేసి, యేకరాత్రంబున నానర్తక దేశం బులు గడచి, విదర్భదేశంబునకుం జనియె. అందుఁ గుండిన పురీశ్వరుం డైన భీష్మకుండు కొడుకునకు వశుం డై, కూఁతు శిశుపాలున కిత్తు నని తలంచి, శోభనోద్యోగంబు సేయించె. అప్పుడు. 39

వ. అంత నా భీష్మకుండు విహిత ప్రకారంబులం బితృదేవతల నర్చించి, బ్రాహ్మణులకు భోజనంబులు వెట్టించి, మంగళాశీర్వచనంబులు చదివించి, రుక్మిణీదేవి నభిషిక్తం జేసి, వస్త్రయుగళ భూషితం గావించి, రత్నభూషణంబు లిడంజేసె. ఋ గ్యజు స్సామ మంత్రంబుల మంగళాచారంబు లొనరించి, భూసురులు రక్షా కరణంబు లాచరించిరి. పురోహితుండు గ్రహశాంతికొఱకు నిగమనిగదిత న్యాయంబున హోమంబుఁ గావించె. మఱియు నా రాజు దంపతుల మేలు కొఱకు తిల ధేను కలధౌత కనక చేలాది దానంబులు ధరణీ దేవతల కొసంగె. అ య్యవసరంబున. 41

వ. మఱియు, నానాదేశంబుల రాజు లనేకు లేతెంచిరి. అందు శిశుపాలు నెదుర్కొని, పూజించి, భీష్మకుం డొక్క నివేశంబున నతని విడియించె. అంతఁ దద్వృత్తాం తంబు విని. 44

వ. అని వితర్కింపుచు. 49

వ. మఱియును. 54

వ. ఇట్లు హరిరాక కెదురుచూచుచు, సకల ప్రయోజనంబులయందును విరక్త యై, మనోజానలంబునం బొగిలెడి మగువకు శుభంబు చెప్పు చందంబున వామోరు లోచన భుజంబు లదరె. అంతఁ గృష్ణు నియోగంబున బ్రాహ్మణుండు సను దెంచిన, నతని ముఖలక్షణం బుపలక్షించి, యా కలకంఠకంఠి మహోత్కంఠతోడ నకుంఠిత యై, మొగంబునం జిఱునగవు నిగుడ, నెదురు సని నిలువంబడిన, బ్రాహ్మణుం డి ట్లనియె. 56

వ. అనిన వైదర్భి యి ట్లనియె. 58

వ. అని నమస్కరించె. అంత రామకృష్ణులు దన కూఁతు వివాహంబునకు వచ్చుట విని, తూర్యఘోషంబులతో నెదుర్కొని, విధ్యుక్త ప్రకారంబునఁ బూజించి, మధుపర్కంబు లిచ్చి, వివిధాంబరాభరణంబులు మొదలైన కానుక లొసంగి, భీష్మకుండు బంధుజన సేనాసమేతు లైన వారలకుం దూర్ణంబున సకల సంప త్పరిపూర్ణంబు లైన నివేశంబులు గల్పించి, విడియించె. ఇట్లు కూడిన రాజుల కెల్లను వయో వీర్య బలవిత్తంబు లెట్లట్ల కోరిన పదార్థంబు లెల్ల నిప్పించి, పూజించె. అంత విదర్భపురంబు ప్రజలు హరిరాక విని, వచ్చి చూచి, నేత్రాం జలులం దదీయ వదనకమల మధుపానంబు సేయుచు. 60

వ. అని పలికిరి. ఆ సమయంబున. 62

వ. మఱియు, సూత మాగధ వంది గాయక పాఠక జను లంతంత నభినందించుచుం జనుదేర, మందగమనంబున ముకుంద చరణారవిందంబులు డెందంబునం దలం చుచు, నిందుధరసుందరీ మందిరంబు చేరి, సలిల ధారా ధౌత చరణ కరారవింద యై, వార్చి, శుచియై, గౌరీసమీపంబునకుం జనియె. అంత ముత్తైదువ లగు భూసురోత్తముల భార్యలు భవసహిత యైన భవానికి మజ్జనంబు గావించి, గంధాక్షతంబు లిడి, వస్త్ర మాల్యాది భూషణంబుల నలంకరించి, ధూప దీపంబు లొసంగి, నానావిధోపహారంబులు సమర్పించి, కానుకలిచ్చి, దీపమాలికల నివాళించి, రుక్మిణీదేవిని మ్రొక్కించిరి. అప్పుడు. 64

వ. అని గౌరీదేవికి మ్రొక్కి, పతులతోడం గూడిన బ్రాహ్మణభార్యలకు లవణా పూపంబులును, దాంబూల కంఠసూత్రంబులును, ఫలంబులు, నిక్షుదండంబులు నిచ్చి రుక్మిణీదేవి వారలన్‌ బూజించిన. 66

వ. ఇట్లు మేఘమధ్యంబు వెలువడి విలసించు క్రొక్కారు మెఱుంగు తెఱంగున, మృగధరమండలంబు నిర్గమించి చరించు మృగంబు చందంబునఁ, గమలభవనర్తకుం డెత్తిన జవనికమఱఁగు దెరలి పొడసూపిన మోహినీదేవత కైవడి, దేవ దానవ సంఘాత కరతల సవ్యాపసవ్య సమాకృష్యమాణ పన్నగేంద్ర పాశ పరివలయిత పర్యాయ పరిభ్రాంత మందరాచల మంథాన మధ్యమాన ఘూర్ణిత ఘుమ ఘుమాయిత మహార్ణవ మధ్యంబున నుండి చనుదెంచు నిందిరాసుందరీ వైభ వంబున, బహువిధ ప్రభాభాసమాన యై, యిందుధరసుందరీ మందిరంబు వెడలి, మానసకాసార హేమకమల కానన విహారమాణ మత్తమరాళంబు భంగి, మంద గమనంబునఁ గనకకలశయుగళ సంకాశ కర్కశ పయోధర భార పరికంప్య మాన మధ్య యై, రత్నముద్రికాలంకృతం బైన కెంగేల నొక్క సఖీలలామంబు కైదండ గొని, రత్ననివహ సమంచిత కాంచన కర్ణపత్ర మయూఖంబులు గండభాగంబుల నర్తనంబులు సలుప, నరవింద పరిమళ కుతూహలావతీర్ణ మత్త మధుకరంబుల మాడ్కి నరాళంబు లైన కుంతలజాలంబులు ముఖమండలంబునఁ గ్రందుకొన, సుందర మందహాస రోచులు దిశలందు బాలచంద్రికా సౌందర్యంబు నావహింప, నధరబింబ ఫలారుణమరీచి మాలికలు వదన కుందకుట్మలంబుల కను రాగంబు సంపాదింప, మనోజాతకేతన సన్నిభం బైన పయ్యెదకొంగు దూఁగ, సువర్ణ మేఖలాఘటిత మణికిరణపటలంబు లకాల శక్రచాప జనకంబు లై మెఱయ, జెఱకువిలుతుం డొఱవెఱికి, వాఁడియిడి, ఝళిపించిన ధగద్ధగాయమానంబు లగు బాణంబులపగిది, సురుచిర విలోకననికరంబులు రాజవీరుల హృదయంబులు భేదింప, శింజాన మంజు మంజీరనినదంబులు చెవులపండువులు సేయఁ, బాద సంచారంబున హరి రాక కెదురుసూచుచు, వీర మోహిని యై చనుదెంచుచున్న సమయంబున. 68

వ. మఱియు, న య్యింతి దరహాస లజ్జావలోకనంబులఁ జిత్తంబు లేమఱి, ధైర్యం బులు దిగనాడి, గాంభీర్యంబులు విడిచి, గౌరవంబులు మఱచి, చేష్టలు మాని, యెఱుక లుడిగి, యాయుధంబులు దిగవైచి, గజ తురగ రథారోహణంబులు సేయనేరక, రాజు లెల్ల నేలకు వ్రాలిరి. ఆ యేణీలోచన తన వామకర నఖంబుల నలకంబులు దలఁగం ద్రోయుచు, నుత్తరీయంబు చక్కనొత్తుచుఁ, గడకంటి చూపులం గ్రమంబున నా రాజలోకంబు నాలోకింపుచు. 70

వ. కని తదీయ రూప వయో లావణ్య వైభవ చాతుర్య తేజోవిశేషంబు లకు సంతసించి, మనోభవ శరాక్రాంత యై, రథారోహణంబు గోరుచున్న వరారోహం జూచి, పరిపంథి రాజలోకంబులు సూచుచుండ, మందగమనంబున గంధసింధురంబులీలఁ జనుదెంచి, ఫేరవంబుల నడిమిభాగంబు గొని చను కంఠీరవంబు కైవడి, నిఖిల భూపాలగణంబుల గణింపక, తృణీకరించి, రాజకన్యకం దెచ్చి, హరి తన రథంబుమీఁద నిడుకొని, భూ నభోంతరాళంబులు నిండ, శంఖంబు పూరించుచు, బలభద్రుండు తోడ నడవ, యాదవ వాహినీ పరివృతుం డై, ద్వారకానగర మార్గంబు వట్టి చనియె. అంత జరాసంధ వశు లైన రాజు లందఱు హరి పరాక్రమంబు విని సహింపనోపక. 72

వ. అని యొండొరులఁ దెల్పుకొని, రోషంబులు హృదయంబుల నిల్పుకొని, సంరంభించి, తనుత్రాణంబుల వహియించి, ధనురాది సాధనంబులు ధరియించి, పంతంబు లాడి, తమతమ చతురంగబలంబులం గూడి, జరాసంధాదులు యదు వీరులవెంట నంటందాఁకి, నిలు నిలుండని ధిక్కరించి పలికి యుక్కుమిగిలి, మహీధరంబులమీఁద సలిలధారలు గురియు ధారాధరంబుల చందంబున, బాణ వర్షంబులు గురిసిన, యాదవసేనలం గల దండనాధులు కోదండంబు లెక్కిడి, గుణంబులు మ్రోయించి, నిలువంబడిరి. అప్పుడు. 74

వ. ఇట్లుచూచిన. 76

వ. అని రుక్మిణీదేవిని హరి యూఱడించె. అంత బలభద్రప్రముఖు లైన యదు వీరులు ప్రళయవేళ మిన్నునం బన్నిన బలిపిడుగుల నడరించు పెను మొగుళ్ళ వడువున, జరాసంధాది పరిపంథి రాజ చక్రంబుమీఁద నవక్ర పరాక్రమంబున శిఖిశిఖా సంకాశ నిశిత శిలీముఖ నారాచ భల్ల ప్రముఖంబు లైన బహువిధ బాణపరంపరలు గురియ, నదియును విదళిత మత్త మాతంగంబును, విచ్ఛిన్న తురంగంబును, విభిన్న రథవరూథంబును, వినిహిత పదాతియూధంబును, విఖండిత వాహ వారణ రథారోహ మస్తకంబును, విశకలిత వక్షో మధ్య కర్ణ కంఠ కపోల హస్తంబును, విస్ఫోటిత కపాలంబును, వికీర్ణ కేశజాలంబును, విపాటిత చరణ జాను జంఘంబును, విదళిత దంతసంఘంబును, విఘటిత వీర మంజీర కేయూరంబును, విభ్రష్ట కుండల కిరీట హారంబును, విశ్రుత వీరాలాపం బును, విదార్యమాణ గదా కుంత తోమర పరశు పట్టిస ప్రాస కరవాల శూల చక్ర చాపంబును, వినిపాతిత కేతన చామర చ్ఛత్రంబును, విలూన తనుత్రాణం బును, వికీర్యమాణ ఘోటకసంఘ రింఖా సముద్ధూత ధరణీపరాగంబును, వినష్ట రథవేగంబును, వినివారిత సూత మాగధ వంది నాదంబును, వికుంఠిత హయ హేషా పటహ భాంకార, కరటిఘటా ఘీంకార, రథనేమి ఫటాత్కార, తురగ నాభిఘంటా ఘణఘణాత్కార, వీర హుంకార, భూషణ ఝణఝణాత్కార, నిస్సాణ ధణధణాత్కార, మణినూపుర క్రేంకార, కింకిణీ కిణకిణాత్కార, శింజినీ టంకార, భట పరస్పర ధిక్కార నాదంబును, వినిర్భిద్యమాన రాజ సమూహంబును, విద్యమాన రక్తప్రవాహంబును, విశ్రూయమాణ భూత బేతాళ కలకలంబును, విజృంభమాణ ఫేరవ కాక కంకాది సంకులంబును, బ్రచలిత కబంధంబును, బ్రభూర పలలగంధంబును, బ్రదీపిత మేదో మాంస రుధిర ఖాదం బును, బ్రవర్తిత డాకినీ ప్రమోదంబును నై యుండె. అప్పుడు. 78

వ. వినుము. దేహధారి స్వతంత్రుఁడు గాడు. జంత్రగానిచేతి జంత్రపుబొమ్మ కైవడి నీశ్వరతంత్ర పరాధీనుం డై, సుఖదుఃఖంబులందు నర్తనంబులు సలుపు. తొల్లి నేను మధురాపురంబుమీఁదఁ బదియేడుమాఱులు పరాక్రమంబునన్‌ విడిసి, యా సప్తదశవారంబులును జక్రిచేత నిర్మూలిత బలచక్రుండ నై, కామపాలుచేతం బట్టువడి, యీ కృష్ణుండు కరుణతో విడిపించి పుచ్చిన వచ్చి, క్రమ్మఱ నిఱువదిమూ డక్షౌహిణులం గూడుకొని, పదునెనిమిదవమాఱు దాడిచేసి, శత్రువులం దోలి, విజయంబుఁ జేకొంటిని. ఇట్టి జయాపజయంబులందు హర్షశోకంబుల నెన్నండును జెంద. నేఁటి దినంబున నీ కృష్ణుని కెదిరిపోర మనరాజలోకంబు లెల్ల నుగ్రాక్షుం గూడుకొని, యెదిరి పోరిన నోడుదుము. ఇంతియ కాక దైవయుక్తం బైన కాలంబునం జేసి, లోకంబులు పరిభ్రమించుచునుండు. అదియునుం గాక. 81

వ. అని ఇట్లు జరాసంధుండును, అతని యొద్ది రాజులును, శిశుపాలుని పరితాపంబు నివారించి, తమతమ భూములకుం జనిరి. శిశుపాలుండు ననుచర సేనాసమేతుం డై, తన నగరంబునకుం జనియె, నంత రుక్మి యనువాఁడు కృష్ణుండు రాక్షస వివాహంబునం దన చెలియలిం గొనిపోవుటకు సహింపక, యేకాక్షౌహిణీ బలంబుతోడ సమరసన్నాహంబునం గృష్ణుని వెనుదగిలి పోవుచుఁ, దన సారథితో ని ట్లనియె. 83

వ. అని ఇట్లు రుక్మి హరి కొలంది యెఱుంగక సారథి నదలించి, రథముఁ గూడ దోలించి, "గోపాలక! వెన్నమ్రుచ్చ! నిమిషమాత్రంబు నిలు నిలు" మని తిరస్క రించి, బలువింట నారి సైరించి, మూఁడు వాఁడితూపుల హరి నొప్పించి, యి ట్లనియె. 85

వ. అని పలికిన, నగధరుండు నగి, యొక్క బాణంబున వాని కోదండంబు ఖండించి, యాఱుశరంబుల శరీరంబు దూఱనేసి, యెనిమిది విశిఖంబుల రథ్యంబులం గూల్చి, రెం డమ్ముల సారథిం జంపి, మూఁడు వాఁడితూపులం గేతనంబు ద్రుంచి, మఱియు నొక్క వి ల్లందినం ద్రుంచి, వెండియు, నొక్కధనువు వట్టిన విదళించి, క్రమంబున పరిఘ పట్టిస శూల చర్మాసి శక్తి తోమరంబులు ధరియించినం, దునుకలు సేసి, క్రమ్మఱ నాయుధంబు లెన్ని యెత్తిన నన్నియు శకలంబులు గావించె. అంతటం దనివి సనక వాఁడు రథంబు డిగ్గి, ఖడ్గహస్తుం డై, దవాన లంబు పైఁ బడు మిడుతచందంబునం గదిసిన, ఖడ్గకవచంబులు చూర్ణంబులు చేసి, సహింపక మెఱుంగులు చెదర నడిదంబు వెఱికి ఝళిపించి, వాని శిరంబుఁ దెగవ్రేయుదు నని, గమకించి, నడచుచున్న, నడ్డంబువచ్చి, రుక్మిణీదేవి హరి చరణారవిందంబులు పట్టుకొని, యి ట్లనియె. 87

వ. ఇట్లు చంపక, బావా! రమ్మని చిఱునగవు నగుచు, వానిం బట్టి బంధించి, గడ్డంబును, మీసంబునుం, దలయును నొక కత్తివాతి యమ్మున రేవులువాఱఁ గొఱిగి, విరూపిం జేసె. అంతట యదువీరులు పర సైన్యంబులం బాఱఁదోలి, తత్సమీపంబునకు వచ్చిరి. అప్పుడు హతప్రాయుం డై, కట్టువడియున్న రుక్మిం జూచి, కరుణచేసి, బలభద్రుండు వాని బంధంబులు విడిచి, హరిని డగ్గఱి, యి ట్లనియె. 91

వ. అని వితర్కించి పలికి, రుక్మిణీదేవి నుపలక్షించి యి ట్లనియె. 94

వ. వినుము. దైవమాయంజేసి, దేహాభిమాను లైన మానవులకున్‌ బగవాఁడు, బంధుడు, నుదాసీనుండు నను భేదంబు మోహంబు సిద్ధం బై యుండు. జలాదులయందుఁ జంద్రసూర్యాదులును, ఘటాదులయందు గగనంబును, బెక్కులై కానంబడు భంగి, దేహధారుల కందఱికి నాత్మ యొక్కం డయ్యును, బెక్కం డ్రై తోఁచు. ఆద్యంతంబులు గల యీ దేహంబు ద్రవ్య ప్రాణ గుణాత్మకం బై, యాత్మ యందు నవిద్యచేతఁ గల్పితం బై, దేహిని సంసారంబునం ద్రిప్పు. సూర్యుండు తటస్థుం డై యుండ, బ్రకాశమానంబు లైన దృష్టిరూపంబులఁ బోలె నాత్మ తటస్థుం డై యుండ, దేహేంద్రియంబులు ప్రకాశమానంబు లగును. ఆత్మకు వేఱొక్కటితోడ సంయోగవియోగంబులు లేవు. వృద్ధిక్షయంబులు చంద్ర కళలకుం గాని, చంద్రునికి లేనికైవడి, జన్మనాశంబులు దేహంబునకుఁ గాని, యాత్మకుఁ గలుగనేరవు. నిద్రవోయినవాఁ డాత్మను విషయఫలానుభవంబులు సేవించు తెఱంగున, నెఱుకలేనివాఁడు నిజముగాని యర్థమునందు ననుభవంబు నొందుచుండుఁ గావున. 99

వ. ఇట్లు బలభద్రునిచేతఁ దెలుపంబడి, రుక్మిణీదేవి దుఃఖంబు మాని యుండె. అట రుక్మి యనువాఁడు ప్రాణావశిష్టుం డై, విడువఁబడి, తన విరూప భావంబునకు నెరియుచు, హరిం గెల్చి కాని కుండినపురంబుఁ జొర నని ప్రతిజ్ఞ సేసి, తత్సమీ పంబున నుండె. ఇ వ్విధంబున. 101

వ. అంత న య్యాదవేంద్రుని నగరంబు సమారబ్ధ వివాహకృత్యంబును, బ్రవర్తమాన గీత వాద్య నృత్యంబును, బ్రతిగృహాలంకృత విలసితాశేష నర నారీవర్గంబును, బరిణయ మహోత్సవ సమాహూయమాన మహీపాల గజఘటా గండమండల దానసలిలధారా సిక్త రాజమార్గంబును, బ్రతిద్వార మంగళాచార సంఘటిత క్రముక కదళికా కర్పూర కుంకుమాగరు ధూప దీప పరిపూర్ణ కుంభంబును, విభూషిత సకల గృహవేదికా కవాట దేహళీస్తంభంబును, విచిత్ర కుసుమాంబర రత్నతోరణ విరాజితంబును, సముద్ధూత కేతన విభ్రాజితంబును నై యుండె. అ య్యవసరంబున. 103

వ. అని చెప్పి. 109

గద్య. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రి పుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతం బయిన శ్రీ మహాభాగవతం బను మహా పురాణమునంబు రుక్మిణీ జన్మంబును, రుక్మిణీ సందేశంబును, వాసుదేవా గమనంబును, రుక్మిణీగ్రహణంబును, రాజలోక పలాయనంబును, రుక్మియను వాని భంగంబును, రుక్మిణీకల్యాణంబును, నను కథలుగల దశమస్కంధంబునందుఁ బూర్వభాగము సంపూర్ణము.

 

Valid XHTML 1.0 Transitional

Valid CSS!