Bhimalapuram.co.in

సామెతలు - ఆచ్చులు అ నుండి అః వరకు

తెలుగులిపిలేదు

  1. అగ్నికి వాయువు తోడైనట్లు.
  2. అబద్ధము ఆడినను అతికినట్లు ఉండ వలెను.
  3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ .
  4. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు.
  5. అప్పు చేసి పప్పు కూడు.
  6. అత్తలేని కోడలుత్తమురాలు కోడలులేని అత్త గుణవంతురాలు.
  7. అనువు గాని చోట అధికులమనరాదు.
  8. అమ్మబోయినఅడివి కొనబోయిన కొరివి.
  9. అయినఆదివారము కాకున్న సోమవారము .
  10. అంత్యనిష్ఠూరము కన్న ఆది నిష్ఠూరము మేలు .
  11. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు.
  12. ఆకాశానికి హద్దే లేదు.
  13. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు.
  14. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు.
  15. ఆది లొనెహంస పాదు.
  16. ఆరే దీపమునకు వెలుగు యెక్కువ.
  17. ఆరోగ్యమే మహాభాగ్యము.
  18. ఆలస్యము అమృతము విషము.
  19. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగము.
  20. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడట.
  21. ఆవు చేనులో మేసిన దూడ గట్టున మేయునా?.
  22. అడగందే అమ్మైన అన్నము పెట్టదు.
  23. అంగట్లొ అన్ని ఉన్నను , అల్లుడి నోట్లొ శని ఉన్నట్లు.
  24. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట.
  25. అందిన జుట్టు అందక పోయిన కాళ్ళు .
  26. అయ్య వారు వచ్చు వరకు అమావాస్య ఆగుతుందా?
  27. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్టు.
  28. ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట.
  29. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత.
  30. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు.
  31. ఇంట గెలిచి రచ్చ గెలువు.
  32. ఇల్లు పీకి పందిరేసినట్టు.
  33. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు.
  34. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలములకంపు.
  35. ఇంటికన్న గుడి పదిలము.
  36. ఇసుక తక్కెడ పేడ తక్కెడ.
  37. ఈతకు మించిన లోతే లేదు.
  38. ఊరంత చుట్టములు ఉత్తికట్ట తావు లేదు.
  39. ఊరు ముఖము గోడలు చెప్పగలవు.
  40. ఋణ శేషము శత్రు శేషము ఉంచరాదు.
  41. ఎనుబోతు మీద వాన కురిసినట్టు.
  42. ఎవరికి వారే యమునా తీరే.
  43. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడెదరు.
  44. ఏ ఎండకు ఆ గొడుగు.
  45. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము.
  46. ఐశ్వర్యము వచ్చిన అర్ధరాత్రి గొడుగు పట్టమనట్లు.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!