Bhimalapuram.co.in

సామెతలు - హల్లులు క నుండి న వరకు

తెలుగులిపిలేదు

 1. కడుపు చించుకుంటె కాళ్ళపైన పడ్డట్టు.
 2. కత్తిపోటు తప్పిన కలంపోటు తప్పదు.
 3. కరవమంటె కప్పకు కోపము విడవమంటె పాముకు కోపము.
 4. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును.
 5. కలిమి లేములు కావడి కుండలు.
 6. కలిసి వచ్చే కాలము వచ్చిన, నడిచి వచ్చే కొడుకు పుడతాడు.
 7. కళ్యాణమొచ్చిన కక్కొచ్చిన ఆగదు.
 8. కాకి పిల్ల కాకికి ముద్దు.
 9. కాకి ముక్కుకు దొండ పండు.
 10. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు.
 11. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు.
 12. కాలు జారితె తీసుకోగలము కాని నోరు జారితె తీసుకోగలమా?
 13. కాలముకలిసి రాక పోతె కఱ్ఱపామై కాటు వేయును.
 14. కాసుంటె మార్గముంటుంది.
 15. కీడెంచి మేలెంచమన్నారు.
 16. కుక్క కాటుకు చెప్పుదెబ్బ.
 17. కుక్క వచ్చినప్పుడు రాయి దొరకదు రాయి దొరికినప్పుడు కుక్క రాదు.
 18. కుడుము చేతికిచ్చిన, పండగ అనేవాడు.
 19. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట.
 20. కృషితో నాస్తి దుర్భి క్షము.
 21. కొత్త అప్పుకు పొతె పాత అప్పు బయటపడ్డదట.
 22. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు.
 23. కొత్తొక వింత పాతొక రోత.
 24. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా.
 25. కొరివితో తల గోక్కున్నట్టు.
 26. కొండ నాలికకి మందు వేసిన, ఉన్న నాలిక ఊడినట్టు.
 27. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు.
 28. కొండల్లే వచ్చిన ఆపద కూడ మంచువలె కరిగినట్టు.
 29. కోటిి విద్యలు కూటి కొరకే.
 30. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్టు.
 31. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !.
 32. కంచే చేను మేసినట్టు.
 33. కందకు కత్తి పీట లోకువ.
 34. కందకు లేని దురద కత్తిపీటకెందుకు.
 35. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము.
 36. గతి లేనమ్మకు గంజే పానకము.
 37. గాజుల బేరము భోజనానికి సరి.
 38. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితె, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట.
 39. గుడిని, గుడిలోని లింగమును మింగినట్టు.
 40. గుడినే మింగే వాడికి లింగమొకలెక్కనా?
 41. గుడ్డి కన్నమెల్ల మేలు.
 42. గుడ్డి యెద్దు చేనులొ పడినట్టు.
 43. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు.
 44. గుమ్మడి కాయల దొంగ అంటెభుజములు తడుముకొన్నాడట.
 45. గురువుకు పంగనామాలు పెట్టినట్టు.
 46. గుఱ్ఱము గుడ్డిదైనను దానాలొ తక్కువ లేదు.
 47. గొంతెమ్మ కోరికలు.
 48. గోరుచుట్టు మీద రోకలి పోటు.
 49. గంతకు తగ్గ బొంత.
 50. చక్కనమ్మ చిక్కినను అందమే.
 51. చచ్చినవాని కండ్లు చారెడు.
 52. చదివేస్తే ఉన్నమతి పోయినట్టు.
 53. చాదస్తపు మొగుడు చెబితే వినడు,.
 54. చాప కింద నీరు.
 55. చిలికి చిలికి గాలివాన అయినట్టు.
 56. చింతకాయలు అమ్మేదానికి సిరిమానము వచ్చినట్టు.
 57. చింత చచ్చి నను పులుపు చావ లేదు.
 58. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు.
 59. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ.
 60. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు.
 61. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ.
 62. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు.
 63. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంత వెతికినట్టు.
 64. జోగి జోగి రాసుకుంటె బూడిద రాలినదట.
 65. డబ్బుకు లోకము దాసోహం.
 66. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్టు.
 67. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన.
 68. దాసుని తప్పు దండముతో సరి.
 69. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు.
 70. దున్నపోతు మీద వర్షము కురిసినట్లు.
 71. దురాశ దుఃఖమునకు చెటు.
 72. దూరపు కొండలు నునుపు.
 73. దయ్యములు వేదము పలికినట్లు.
 74. దేవుడు వరము ఇచ్చినను పూజారి వరము ఇవ్వడు.
 75. దొంగకు తేలు కుట్టినట్లు.
 76. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి.
 77. నక్కకు నాగలోకమునకు ఉన్నంత తేడా.
 78. నడమంత్రపు సిరి నరముల మీద పుండు.
 79. నవ్వు నాలుగు విధముల చేటు.
 80. నిజము నిప్పు వంటిది.
 81. నిదానమే ప్రధానము.
 82. నిప్పు ముట్టనిదే చేయి కాలదు.
 83. నిమ్మకు నీరెత్తినట్లు.
 84. నిండు కుండ తొణకదు.
 85. నీ చెవులకు రాగి పొగులే అంటే వికూడ నీకు లేవు అన్నట్టు.
 86. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు.
 87. నూరు గుఱ్ఱములకు అధికారియయినను, భార్యకు యెండు పూరి.
 88. నూరు గొడ్లు తిన్న రాబందుకైనను ఒకటే గాలిపెట్టు.
 89. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉన్నదో నీ మాటలో అంతే నిజము ఉన్నది.
 90. నోరు మంచిదయితె ఊరు మంచిదవుతుంది .

Valid XHTML 1.0 Transitional

Valid CSS!