Bhimalapuram.co.in

సామెతలు - హల్లులు ప నుండి క్ష వరకు

తెలుగులిపిలేదు

 1. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంత పచ్చగకనపడినట్టు.
 2. పట్టి పట్టి పంగనామము పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట.
 3. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు.
 4. పరిగెత్తి పాలు త్రాగుట కంటె నిలబడి నీళ్ళు త్రాగుట మేలు.
 5. పానకములో పుడక.
 6. పాపమని పాత చీర ఇచ్చిన - గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట.
 7. పాము కాళ్ళు పామునకెరుక.
 8. పిచ్చి కోతికి తేలు కుట్టినట్టు.
 9. పిచ్చుకపై బ్రహ్మాస్త్రము.
 10. పిచ్చివాడి చేతిలో రాయి ఉన్నట్టు.
 11. పిట్ట కొంచెము కూత ఘనము.
 12. పిల్లికి చెలగాటము ఎలుకకు ప్రాణ సంకటము.
 13. పిల్లి శాపములకు ఉట్లు తెగుతవా?.
 14. పిండి కొద్ది రొట్టె.
 15. పుణ్యము కొద్దిపురుషుడు, దానము కొద్ది బిడ్డలు.
 16. పువ్వు పుట్టగనే పరిమళించినట్టు.
 17. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది.
 18. పెరుగు తోట కూరలో పెరుగు యెంత ఉన్నదో, నీ మాటలో అంతే నిజము ఉన్నది.
 19. పెళ్ళికి వెళ్లుతు పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు.
 20. పెళ్ళంటే నూరేళ్ళ పంట.
 21. పేనుకు పెత్తనమిచ్చిన తల మొత్తము గొరికిందట.
 22. పొర్లించి పొర్లించి కొట్టినను, మీసములకు మట్టి అంటలేదన్నట్టు.
 23. వెళ్లరానిచోట్లకు వెళ్ళితే , రారాని మాటలు రాకపోవు.
 24. పోరు నష్టము పొందు లాభము.
 25. పండిత పుత్రః పరమశుంఠః.
 26. బ్రతికియుంటే బలుసాకు తినవచ్చును.
 27. బయటకు తెలియవు.
 28. బూడిదలో పోసిన పన్నీరు.
 29. భక్తి లేని పూజ పత్రి చేటు.
 30. మనిషికి మాటే అలంకారము.
 31. మనిషికొక మాట పశువుకొక దెబ్బ.
 32. మనిషి పేద అయితే మాటకు దనా?
 33. మింగమెతుకులేదు మీసములకు సంపంగి నూనె.
 34. ముల్లును ముల్లుతోనే తీయవలెను వజ్రాన్ని వజ్రంతొనే కోయయవలెను.
 35. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు .
 36. ముందర కాళ్ళకి బంధములు వేసినట్టు.
 37. ముందుకు పోతె గొయ్యి వెనుకకు పోతె నుయ్యి.
 38. మెత్తగ ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట.
 39. మెరిసినవన్ని బంగారము కాదు.
 40. మొక్కై వంగనిది మానై వంగునా?
 41. మొరిగే కుక్క కరవదు కరిచే కుక్క మొరగదు.
 42. మొసేవానికి తెలుసు కావడి బరువు.
 43. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో .
 44. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?
 45. మంది యెక్కువయితె మజ్జిగ పలచ అయినట్టు.
 46. రాజు గారి దివాణములో చాకలోడి పెత్తనము.
 47. రామాయణము అంత విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు.
 48. రామాయణములో పిడకల వేట.
 49. రామేశ్వరమువెళ్ళినను శనేశ్వరము వదలనట్టు.
 50. రెడ్డి వచ్చె మొదలెట్టు అన్నట్టు.
 51. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు.
 52. రౌతు కొద్ది గుఱ్ఱము .
 53. లోగుట్టు పెరుమాళ్ళకెరుక.
 54. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక.
 55. శివుని ఆజ్ఞ లేక చీమైనను కుట్టదు.
 56. శుభం పలకరా వెంకన్నా అంటే పెళ్ళి కూతురు ముండ ఎక్కడ అన్నాడంట!.
 57. సంతొషమే సగము బలము.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!