Bhimalapuram.co.in

తెలుగు భాషలో టెక్స్‌లైవ్

ఆంగ్లము తెలుగు లిపి లేదు

టెక్స్‌లైవ్ చాల పెద్ద పరికరము[package] - పరిమాణము [size] - 2GB కంటే ఎక్కువ . అతి విశిష్టమైనది. దీనిని ఉపయోగించి ఒక చిన్న వ్యాసము నుండి సుదీర్ఘమైన - చిత్రములు, క్లిష్టమైన గణిత సూత్రములు , వివిదమైన పంక్తులు, నిలువ పంక్తులు [ multi-page tables with complex rows and columns]గల పట్టికలు , ఆంగ్లము, ఇతర భారతియ అంతర్జాతియ భాషలతో కూడిన భాగములు వున్న- పుస్తకము సృష్టింప వచ్చును.

చేపట్ట వలసిన చర్యలు

1. వి/జీఎడితర్ వంటి text editorలను సంసిధ్ధపరచి ఇదివరకే [లేఖిని/స్వేచ్చ/Unicode-indic transliteratorలతో తయారైన తెలుగు వ్యాసమును అందు అతికించు కొనవలెను.

2. టెక్స్ పరికరములకు అవస్యమైన పదజాలమును[syntax] తగిన చోట కలపవలెను. ఈ వ్యాసమును చదివ గలరు. ఫాంట్‌స్పెక్, ఎక్స్‌యునికోడ్, xltxtra, హైపెర్‌రెఫ్ అనబడు పరికరములను, చిత్ర/చలనచిత్రములున్నచో graphicx వంటి ఇతర పరికరములను పేర్కొనవలెను. క్రింద ఇవ్వబడిన చిత్రములో అవసరమైన పదజాలమును[syntax] గుర్తింప గలరు.

ఈ వ్యాసమును తగిన పేరుతో, పేరు అంతమున ".టెక్స్" అను ప్రత్యయము[suffix]తో బదిల పరచుకొనవలెను. "xelatex *tex" అను ఆదేశము ఇచ్చిన, అదే పేరు [pdfప్రత్యయము[suffix]తో] ఒక పత్రము ఉత్పత్తియగును. ఈ ప్రక్రియ ఫలితమివ్వ నిచో log fileను పరిశీలింప వలెను. కనిపించిన పొరపాట్లను సవరించి, తిరిగి "xelatex *.tex" ఆదేశమిచ్చిన పీడీఎఫ్ పత్రము ఉత్పత్తియగును.

ఉదాహరణము: క్రింద ఒక టెక్స్‌పత్రము చూప బడినది.

 Typical Syntax

అవశ్యమైన ఆంశములు

1. వ్రాయబడు పత్రములలో నిర్దుష్టమైన కుడి ఎడమ అంచులకై [perfect margins on right and left] ప్రతి పంక్తి[line] అంతమున - " \linebreak" అను చిహ్నము ఉండవలెను. 2. క్రొత్త విభాగము paragraph ముందు రెండు పంక్తు[line]ల ఖాళి స్థలము వదలవలెను.

3. a.పోతన2000, వేమన, లోహిత్ వంటి ఖతులను వాడినప్పుడు: మధ్యలో ఆంగ్ల పదములున్నచో వాటిని "$ $" అను చిహ్నముల లోపల వుంచ వలెను. ఈ అదనపు చిహ్నము పొన్నాల, రవిప్రకాష్, లక్కిరెడ్డి వంటి - ఆంగ్లలిపి ఆమర్పబడని - ఖతులలో కూడ అవసరము.

3.b.గణిత విషయములను "$$ ...$$" అను చిహ్నముల లోపల వుంచ వలెను.

4."xelatex *.tex" అను అదేశమును రెండు లేక మూడు సార్లు జారి చేయ వలెను. కారణము: ఇతర స్థములకు - సంపుటములకు అనుబంధము కల్పించు సూచికలు సక్రమముగ వ్యవహరించుటకు ఇది అవసరము. "\usepackage[colorlinks]{hyperref}" అను వాక్యము "\usepackage" వాక్యములన్నింటి తరువాత వుండవలెను.

5.a. "xelatex *.tex" అను ఆదేశము జారి చెయుటకు ముందు ఒక సారి వాక్యవళి[ syntax] ను పరీక్షించి, సవరించుకొన వలెను. ముఖ్యముగ - ఆదేశములలో "\" చిహ్నము - [ "/ - కాదు"] వాడ వలెను. అదనపు అంశము[optional features] లకు "[ ]" లను , అవసరమైన అంశము[compulsory features]లకు "{ }" చిహ్నములను వాడ వలెను.

b.అదనము[extra]గ - తెలుగు ఖతు[font]లను దిగుమతి చేసికొని, అమర్చుకొన వలెను. "పోతన2000 " అను ఖతి[font] ఉచిత దిగుమతికి లభ్య మగు ఖతులలో ఒకటి. ఫెడోరాలో - లభించును. లేక ఈ వ్యాసము నుండి తగిన ఖతులను దిగుమతి చేసొకొన గలరు. ఖతులను అమర్చుటకు - సంబంధిత టిప్పణునలను చూడ గలరు.

c. టెక్స్‌వాక్యావళి[syntax]లో తెలుగు భాషకు సంబంధించిన వాక్యము "\setmainfont[Mapping= text-tex,Script=Telugu]{Peddana}". "పెద్దన"కు బదులుగ ఇతర ఖతులులను వాడిన - ఆ ఖతిని పేర్కొనవలెను.

6. విశేషమైన విషయములకు [చిత్రములు, అంకెలు, గద్యము గల పంక్తులు, నిలువ పంక్తులు, పలు పుటముల విస్తారణము గల పట్టికలు [multi-page tables], గణిత వ్యాసములు - కల్పింప వలసినచో - వాటికైన విశేష పరికరములను[additional packages] లను "\usepackage{}" వాక్యములతో పేర్కొనవలెను.

7.ఉచితముగ దొరకు తెలుగు ఖతులు: పోతన 2000 : wwwDOTkavyanandamDOTcom లేక ఇక్కడనుండి దిగుమతి చేసుకొనవచ్చును. లోహిత్ : ఫెడొరాతో/లో దొరకును. సంయుక్త ఆ.ప్ర. ప్రభుత్వము/సిలికాన్ వాల్లె వారు ఉమ్మడి ప్రయత్నముతో విడుదలచేసిన 18 ఖతులను ఇక్కడనుండి దిగుమతి చేసుకొనగలరు. వారు సూచించిన, మేము దిగుమతికి ఇచ్చు షరతులు : ఓపెన్‌ఫాంట్ లైసెన్స్ .ఈ చిత్రమున వీటి రూపమును చూడ గలరు. గమనిక: వ్యాసము[file]లో సూచింపబడిన packages మాత్రమే ఉపయోగింపబడును. అమర్చపడి, కాని వ్యాసమున పేర్కొనబడని packagesలను "xelatex *.tex" ఆదేశము గుర్తించదు.

8. టెక్స్‌లైవ్ పరికరముతో - దీని ఉపయోగము, ప్రయోగములు, సమస్యలు - వాటికి పరిష్కారములు వంటి అన్ని అంశములున్న సుదీర్ఘమైన టిప్పణి కూడ అమర్చబడుతుంది. ఈ టిప్పణి వలె ఈ ప్రాథమిక మార్గదర్శిని, ఫాంట్‌స్పెక్ అనబడు సంబంధితపరికరము గురించిన సూచనలు చాల ఉపయోగమగును. wwwDOTtugDOTorg, wwwDOTctanDOTorgన టెక్స్‌లైవ్ కైన అన్ని సమస్యలకు పరిష్కారము, సరైన మార్గములు - వీటిపై సంపూర్ణమైన వివరములు లభీంచును. ఈ పరికరములో తరచుగ మెరుగుదలతో కలసిన మార్పులు, సరవరణలు వచ్చుట వలన - ఈ websitesలను చూచి - అటువంటి సవరణలను వాడు కొన గలరు.మేము ఉపయోగించు టెక్స్‌లైవ్2010.......చాల పురాతనమైనది.......ఐనను చాల విశిష్టమైనది.....మీ అవసరములకు తరువాత వచ్చిన - ఇంకను మెరుగైన రూపముversionsలను వాడుకొను అవకాసమున్నది.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!