Bhimalapuram.co.in

తెలుగులో గణాంకములు [Databases] -Mariadb

ఆంగ్లము తెలుగులిపిలెదు

స్వేచ్ఛగ లభించు database system మైఎస్‌క్యూఎల్ సంస్థ సన్ మైక్రో సిస్టెంచే కొనబడినది. తరువాత ఈ సంస్థ Oracle వారిచే కొనబడినది. Oracle సంస్థ (1) మైఎస్‌క్యూఎల్ దిగుమతి/ఉపయోగము గురించిన పద్ధతులు ఇంతకుముందున్నట్టే ఇకముందుకూడ కొనసాగునని, (2) ఇది తమ సొంత పరికరమైన Oracle తో సహా లభించునని వెల్లడించినది.

ఐనను మైఎస్‌క్యూఎల్ free softwareగ కొనసాగుతుందా అను అనుమానము వెలువడుచున్నవి. మైఎస్‌క్యూఎల్ సంస్థ స్థాపకులలో ఒకరు , ప్రధాన సృష్టికర్త - మైకేల్ మాంటి Widenius -మైఎస్‌క్యూఎల్‌నకు బదులుగ వాడుటకు మరియాడీబిని రూపొందించిరి . ఈ పరికరమును మైఎస్‌క్యూఎల్‌తో సమానముగ - దానికి తగినట్టుగ - వృద్ధి చేయుటయే మరియాడీబి వారి ఉద్దేశము. మరియాడీబి లోని అదేశములు మైఎస్‌కుఎల్ లోని అదేశములు- ఒకటే.

ప్రధాన లైనక్‌స్ రకములలో ఫెడోరా, సూసే, స్లాక్, ఓపెన్ సూసే, Gnu/Linux వారి Kdu వంటి వారు మైఎస్‌క్యూఎల్‌ని తొలగించి మరియాడీబిని వాడుచున్నారు. Oracle మైఎస్‌క్యూఎల్‌ అభివృద్ధిని నిలిపివేస్తున్నది/నిలిపివేయవచ్చు నను అనుమానమే ఈ మార్పునకు కారణము.

మైఎస్‌క్యూఎల్‌ కంటే తమ పరికరము మెరుగైనదని, వేగవంతమైనది మరియాడీబి సృష్టికర్తనల వాదన. అన్ని ప్రధాన లైనక్‌స్ రకములు మరియాడీబిని మైఎస్‌క్యూఎల్‌ సహచరిగా లేక బదులుగ వాడుచిన్నవి. పూర్తి వివరములకు మరియాడీబి వారి స్థావరమును చూడగలరు.