Bhimalapuram.co.in

పచ్చళ్లు

ఆంగ్లము తెలుగు లిపి లేదు

పచ్చళ్లు - వాటి తయారి గురించిన వివరములు ఇక్కడ ఇవ్వబడినవి. పచ్చళ్లు - నిమ్మ , మామిడి, టొమాటో, ఉసిరి , సులువుగ అందుబాట్లో వుంటున్న - దొరకు - కూర కాయలతో [కరెవపాకు, కొత్తమిరి, పొదిన, గోంగూర బీరకాయ లతో] -సునాయాసముగ తయారి చేసుకొన వచ్చును. కొన్ని పచ్చళ్లను కొద్ది రోజుకే నిలువ చేసుకొన గలము. కొన్ని ఎక్కువ సమయము - వారములు - నెలలకు నిలువ వుంచుకొన వచ్చును.ఈ పచ్చళ్లను పులుసు - చారు -తో అదనముగైన- లేక వీటికి బదులుగైన వాడ వచ్చును.

కొద్ది దినములకు నిలువ కైన పచ్చళ్లు: కరేపాకు, కొత్తమిరి, పొదిన, గోంగూర, కాబేజి, బీరకాయ, దోసకాయ, దోసకాయ--పెరుగు, కొబ్బరి, కంది, వంకాయ ,అల్లము, వెలగ-కారము.

ఎక్కువ కాలము నిలువకు వీలైన పచ్చళ్లు:నిమ్మ, మామిడి, ఉసిరికాయ, టొమాటో

తీసుకొనవలసిన జాగ్రతలు:

1.2.తడి - తేమ - లేని గరిటె - చెంచ - లనే వాడ వలెను.

3. వడ్డన - వాడకమునకు ముందు ఉపయోగింప నున్న పదార్థములు తినతగినవని చూచుకొన వలెను.

4. నిలువ చెసిన పచ్చళ్లను వుంచిన జాడిలు, గిన్నెల ను బిగువుగ - గాలి,తేమ సోకకుండ - మూసి వుంచ వలెను.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!