Bhimalapuram.co.in
ఆకస్మిక లైనక్‌స్ - లైవ్‌సీడీ

ఆంగ్లము తెలుగులిపిలేదు

ఇంటికి వచ్చిన అతిథి వలె సంచరించి, కార్యక్రమములు ముగిసిన తరువాత వ్యవస్తను నిలిపగానే అదృశ్యమై తాత్కాలికముగ జీవించు ఆకస్మిక పరికరమే లైవ్‌సీడీ. చేసిన కార్యక్రమములను కావలసిన విదముగ సీడి/డీవీడి/యూఎస్‌బి/పెన్‌డ్రైవ్, external hard driveలలో బదిల పరచుకొన గలము. ప్రత్యేక పనులకు తగిన వివిధ లైవ్‌సీడీలు అందుబాట్లో యున్నవి.

ఏ కారణముచేతనైన లైనుక్స్ శాశ్వతముగ వ్యవస్త (operating system)లో అమర్చుకొనలేనప్పుడు- లేక అత్యవసరముగ కార్యక్రమములకు అవసరమైనప్పుడు - తాత్కాలిక రూపమున లైనక్‌స్‌ను ఉపయోగించుకొన వచ్చును. కార్యలయములోని అన్ని పనులకు (all office work) , చిత్ర/చలనచిత్ర (graphics- videos), గాత్ర/సంగీతము(audio files), అంతర్జాలము (internet) వంటి అన్ని పనులను - ఈ తాత్కాలిక రూపముననుండు లైనుక్స్ - ఫ్రీబీఎస్‌డీతో చేసుకొన వచ్చును.

ఈ తాత్కాలిక వ్యవస్థ సీడి/డీవీడి/యూఎస్‌బి/పెన్‌డ్రైవ్, external diskలన యుండి - శాశ్వత వ్యవస్థ(operating system) - hard diskలకు సంబంధము లేకుండ RAMలో వ్యవహరించును. ఉన్న Operating system, hard Diskలకు అతీతముక వుండుటచే- ప్రస్తుతము వున్న విశిష్టమైన విషయములు (sensitive data), కార్యాలయ సంబంధిత విషయములు (official information)లకు ఎటువంటి హాని లేక ప్రభావము కలుగదు. ప్రత్యేకముగ అంతర్జాల సంబందిత పనులకు ఈ మాయావి వంటి పద్ధతి చాల తగినది. ఇతరుల ఆక్రమణ (attack from virus, malware) నుండి సురక్షితమైనది.

వీటి పరిమాణము(size) చిన్నగ వుండుటచే కార్యక్రమములు చాల వేగముగ జరుగును. ఇవి 100ఎంబీ నుండి కొన్ని జీబిల వరకు యున్నవి. కావలసిన పనులకు తగిన లైవ్‌సీడీ ఎన్నుకొన గలము.

డాంస్మాల్‌లైనక్స్, పప్పి లైనక్స్, స్లాక్స్ వంటి చిన్న లైవ్‌సీడీలు ప్రసిద్దమైనవి. మన ఇష్టానుసారము ఎన్నిక చేసికొన గలము. వీటిలో పప్పి లైనుక్స్ చాల విశిష్టత గలిగినది. అవసరమైన అన్నిరకముల పనిముట్లు గలది. అవసరమైనచో తెలుగు (లేక ఇతరభాషల) లిపి/ఖతులు(fonts) అమర్చుకొని, ఆ యా భాషలలో పనులు చేసికొన వచ్చును. స్లాక్స్ లో మరొక విశిష్టత వున్నది - కావలసిన పనిముట్లను (extra packages) అతి సులువుక చేర్చుకొన గలరు. లింప్ సంగీత/చిత్ర/చలన చిత్రములకు తగినది..

ఈ లైవ్‌సీడీలను (తాత్కాలికముగ) ప్రారంభించిన తరువాత సీడి/డీవీడిలను తీసి వేసి - కావలసిన ఇతర సీడి/డీవీడిలతో పని కొన సాగింప వచ్చును.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!