Bhimalapuram.co.in
తెలుగు భాష

ఆంగ్లము తెలుగులిపిలేదు

తెలుగు దక్షిణ భారతములోని ముఖ్యమైన భాషలలో ఒకటి. అచ్చు తెలుగులోని చాల పదములకు తమిళ భాషలోని పదములకు పోలికలు గవు. ఉ||మామ-మామా, అత్త-అత్తై, కాలు-కాల్, పది-పత్తు.

తెలుగు కన్నడ లిపులు వేరైన- పోలికలు గలవు. కన్నడలిపి లేక తెలుగులిపి తెలిసిన వారు ఇతర లిపిని (కొంత శ్రమతో) చదవగలరు.

తెలుగు సాహిత్యము కనీసము వెయ్యి సంవత్సరములుగ వ్యవహారమున గలదు. మంచి పద్య రచనలు చాల గలవు. ద్విపద కావ్యములు - ఒకే రచనలో రెండు కథలను వర్ణించు రచనలు బహుశః తెలుగులోనే గలవు. "రాఘవ పాండవీయము" రామాయణమును, మహాభారతమును వర్ణించును. పదముల అల్లికల విశిష్టతచే అటు రాముని చరిత్రను మరొక వైపు పాండవులు/కౌరవుల చరిత్రను చదవగలము. ఈ విశేష రూపమునకు మరొక నిదర్శనము: హరిశ్చంద్ర నలోపాఖ్యనము. పదజాలములచే ఈ గ్రంధము అటు నళ మహారాజు కథను ఇటు హరిశ్చంద్ర మహారాజు కథను వివరించును.

గద్యము/గద్య రచనలు బాగ అభివృద్ధి చెందినవి. సమీప కాలముగ వ్యవహారమునకు వచ్చిన వైద్య/వాణిజ్య /వైఙ్ఞానిక ఇతర శాస్త్రియ రంగముల సాకేతిక పదములు తప్ప తెలుగున విషయములంటిని గద్యమున తెలుపగలము. శైలి: సులువైన - కావలసిన రూపమున తీర్చి దిద్దగలము. ఆధినిక సాకేతిక/వైఙ్ఞానిక పదముల అనువాదములలో చాల కృషి చేయవలసియున్నది. అచ్చు తెలుగు పదములు కావసినంత గలవు: సంస్కృత పదములను తక్కిన చోట్లో వాడు పద్ధతి గలదు. కనుక సంస్కృతములోని సాంకేతిచ పదములను వాడవచ్చును.

నాటక రచనలు చాల ఉన్నవి. తెలుగులోని మరొక సులువైన రచనారుపము "శతకము". శతకములు తరచుగ 100 పద్యములతో నైతిక/భక్తి భావమును లేక ఏదో ఒక విషయమును వివరించు రచనా రూపములు. చక్కటి, సులువైన పదములతో చెప్పదలచిన విషయమును వర్ణించును.(నిర్లక్ష్యముచే అదృశ్యమైనవి తప్ప) సుమారు 300 శతకములు ఉన్నవి.

ఇంతటి గొప్ప తెలుగు భాషను/సాహిత్యమును పోషించి, అభివృద్ధి చేయవలసిన కర్తవ్యము మనది. ఆంగ్ల/పాశ్చాత్య భాషల దాడులనుండి తెలుగును రక్షంచి వికసింప చేయవలసిన బాధ్యత మనపై ఉన్నది.

పరిచయము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!