Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6473

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: గుండక్రియ

కటకట హరిమాయాకల్పనెట్టిదో
తటుకునఁ బారవేసే తలఁపెందు లేదు॥పల్లవి॥
  
  
అనంతకోటియుగాదులనుండియు
తనివోక విషయాలఁ దగిలుండినా
దినమొక్కొక్కరుచియై తీపులై పండీఁగాని
వెనుకొన్న యాత్మకు వెగ టెందు లేదు॥కటకటా॥
  
  
కడలేక నాలుకకుఁ గన్నయాహారములెల్ల
వోడలిలోఁ బూఁటవూఁట వొట్టుకొనినా
సడిఁ బైపై వింతవింతచవులే వెదకుఁగాని
విడువని యాత్మకు వెగ టెందు లేదు॥కటకటా॥
  
  
కలకాలముననుండి కాపురపు లంపటాలె
కలిమితో మెడఁగుచ్చి కట్టుకొనినా
యెలమితో శ్రీవేంకటేశ్వరునాజ్ఞల -
నలవాటైన యాత్మకలపే లేదు॥కటకటా॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!