Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6485

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: లలిత

కటకటా యీ యాత్మ లేగతి నీడేరఁ గలరు
యిటు నీకు శరణంటే యిట్టే రక్షింతువు॥పల్లవి॥
  
  
చేరి నీ మహిమ చిరజీవుల నడిగే మంటే
ఆ రీతి జీవులు బ్రహ్మాదిదేవత లింతే
వారఁ దమపుట్టిన యవ్వలగాని తొల్లింటి
నీ రూప మింతింతని నిశ్చయింప లేరు॥కటకటా॥
  
  
అందరికి శ్రుతులే ఆధార మనాదినుండి
పొందుగా నడిగే మంటే పొడచూప వదియును
కందువ ఋషులపాఠక్రమముల వచ్చె నింతే
అందరియర్థములు నిశ్చయము సేయ లేరు॥కటకటా॥
  
  
అదిగాన యెంచి సనకాదులు శుకాదులును
మొదలనే నినుఁ గొల్చి ముక్తు లనిపించుకొనిరి
అదనఁ దక్కిన వుపాయముల నింత వున్నదా
పదిల మలమేల్మంగపతి శ్రీవేంకటేశా॥కటకటా॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!