Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6502

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: సామంతం

కడమ లున్నవా యింకఁ గైకొన్నదాన
యెడయని దొరవు నీయిచ్చ యింతేకాక॥పల్లవి॥
  
  
వాసులెంచవలెనా వలచినదాన నేను
సేసినటెల్లా నీకుఁ జెల్లెఁగాక
వేసరఁగఁ దగునా నీ వేలువట్టినట్టిదాన
రాసికెక్కినట్టి నీరపమాయఁ గాక॥కడ॥
  
  
వోపనవలెనా వూడిగపుదాన నేను
చేపట్టినట్టెల్లా నీకె చెల్లెఁగాక
కోపగించఁ దగునా కొలువు సేసేటిదాన
దాపుగ నీవాడినపంతము దక్కెఁగాక॥కడ॥
  
  
గోర గీరవలెనా కూడినట్టిదాన నేను
చీరకొంగంటినదెల్లాఁ జెల్లెఁగాక
ధీరుఁడ శ్రీవేంకటేశ తిట్టఁదగునా నీదాన
నేరిచిన నీనేరుపు నెరవేరెఁగాక॥కడ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!