Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6527

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: హిందోళవసంతం

కడు ముద్దరాలు గన కక్కసించ నోపదు
వడిఁ బెట్ట కిఁక నిట్టె వర మియ్యవయ్యా॥పల్లవి॥
  
  
నిన్నుఁ జూచి నవ్వు నవ్వి నివ్వెరగుఁ బొందెఁ జెలి
సన్నలు నీకే తెలుసు సరసుఁడవు
విన్నపము నేనే నంటె వెలది చిత్త మెఱఁగ
వున్నతి చెలి మోహము వొప్పు గొనవయ్యా॥కడు॥
  
  
అప్పసము చేయి చాఁచి ఆయములు గరఁగె యీ
చొప్పు నీవె యెరుఁగుదు సుజాణఁడవు
అప్పటిఁ గొసరే మంటె ఆపెమర్మ మెరఁగము
చిప్పిలువయసు నీకే సెలవు సుమ్మయ్యా॥కడు॥
  
  
మేరతో దగ్గరుతానె మెచ్చె నిన్నిటా నీకె
ఆ రతి నీ వెరుఁగుదు వధికుఁడవు
కూరిమి శ్రీవెంకటేశ కూడితివి మగువను
నేరుతుమా నే మంత నీనే రక్షించవయ్యా॥కడు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!