Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6537

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: సామంతం

కడుఁ గోమలమగు కాంత యిది
అడియాలపు ముద మందించరాదా॥పల్లవి॥
  
మొక్కులు మొక్కుచు మోము చూడఁగా
వుక్కుగోర నటు వూఁదితివి
యిక్కడ సతి మతి నేమని వున్నదొ
చక్కఁగ నూరడించఁగరాదా॥కడు॥
  
కలకల నవ్వుచు కానుకియ్యఁగా
బలిమిఁ బెనఁగి యటు పదరితివి
అలసి యెంత తురుమదవద లాయనొ
మలసి లాలింపుచు మన్నించరాదా॥కడు॥
  
సేవలు సేయుచు చిడుముడి పడఁగా
కావిరిఁ గాఁగిటఁ గలసితివి
శ్రీవేంకటేశ్వర సిగ్గెటులుండెనొ
యీ విధముల నిటు యీడేర్చరాదా॥కడు॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!