Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6563

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: భూపాళం

కనియు గానని మనసు కడమ గాక
యెనలేని హరిమహిమ కిది గుఱుతుగాదా॥పల్లవి॥
  
  
కనుకలిగి హరిగొలిచి ఘనులైరిగాక మును
మునుజులే కారా మహరుషులును
మనసులో నిపుడైన మరిగి కొలిచినవారు
ఘనులౌట కిదియ నిక్కపు గుఱుతుగాదా॥కని॥
  
  
భావించి హరిఁగొలిచి పదవులందిరిగాక
జీవులే కారా దేవతలును
కావించి కొలిచినను ఘనపదవు లేమరుదు
యేవలన నిందిరికి నిది గుఱుతుగాదా॥కని॥
  
  
పన్ని హరిఁగొలిచి నేర్పరులైరి గాక ధర-
నున్నవారే కారా యోగివరులు
యెన్నికల శ్రీవేంకటేశు నమ్మినవార
లిన్నియునుఁ జేకొనుట కిది గుఱుతుగాదా॥కని॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!