Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6584

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: నాదరామక్రియ

కన్నదే విన్నదే కందువ సుమ్మీ
వున్నతి నీసతి సుమ్మీ వొడఁబాటిద్దరికి॥పల్లవి॥
  
  
యేకడ నీవుండినాను యెంత పనిగలిగినా
ఆకెమాటే నామాట అట్టె రమ్మీ
పోకలెన్నైనాఁ గలవు పొందు లెన్నైనాఁగలదు
సాకిరి యీచెలిసుమ్మీ సరుస నిద్దరికి॥కన్న॥
  
  
అలుకెంత గలిగినా అడ్డములే యాడినా
చెలిమొక్కే నామొక్కు చేకోనుమీ
తలఁపటైయినాఁగాని తగులెంతయినాఁగాని
తొలుత యీపెసుమ్మీ దూతిక యిద్దరికి॥కన్న॥
  
  
యెంతదవ్వువొయినా యేమని పోడచూపినా
యింతిసన్నే నాసన్న యెఱుఁగుకొమ్మీ
యింతేల శ్రీవేంకటేశ యిందాఁకాఁ గూడితిని
సంతతయు నీకెసుమ్మీ సాదన మిద్దరికి॥కన్న॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!