Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6595

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: దేసాక్షి

కన్నవిన్నవారెల్లా కాకు సేయరా
వున్నతుఁడవైన నీకీ వొచ్చములేలయ్యా॥పల్లవి॥
  
  
దేవతలఁ గాచినట్టి దేవుఁడ నీకుఁ బసుల
నీవలఁ గాచితివనే హీనమేలా
కావించి పాలజలధిఁ గాఁపురముండినయట్టి-
నీవు పాలదొంగవనే నింద నీకేలయ్యా॥కన్న॥
  
  
కాలమందు బలి దైత్యుఁ గట్టివేసినట్టి నీకు
రోలఁ గట్టువడినట్టి రోఁత నీ కేల
పోలించి లోకాలకెల్ల పొడవైన దేవుఁడవు
బాలుఁడవై రేపల్లెలోఁ బారాడనేలయ్యా॥కన్న॥
  
  
పాముమీఁదఁ బవ్వళించి పాయకుండినట్టి నీకు
పాముతల దొక్కినట్టి పగలేలా
కామించి శ్రీవేంకటాద్రి కడపరాయఁడ నీవు
భూమి మాయలణఁచి నేర్పుల మాయలేలయ్యా॥కన్న॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!