Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6627

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: శంకరాభరణం

కన్నెవయసు మీఁదనే ఘనజవ్వనము వచ్చె
విన్న కన్న చోటనేల వెరగందేవే॥పల్లవి॥
  
  
పూచినవెన్నెలనవ్వు పుప్పొడితేనెమాటలు
కాచిన చన్నుల నిమ్మకాయ లవిగో
యేచిన వసంతకాల మిప్పుడే నీ మేన నిండె
చేచేత నిఁకనేల సిగ్గువడేవే॥కన్నె॥
  
  
కందువ చిగురు మోవి కప్పినకన్నులకావి
మందపు నిట్టూర్పులమంచిగాలి
అందపునీ మేనిమీఁద నామనికాలము వచ్చె
యిందులో నీపతి వచ్చె నేలకొంకేవే॥కన్నె॥
  
  
పండినపులకపంట పాయపుఁగళలపచ్చి
మెండగుబాహులతలు మేరవరెను
నిండి శ్రీవేంకటపతి నిన్నుఁ గూడెఁ దతికాల
మండనే నీమేనఁ దోఁచె ననుమానమేలే॥కన్నె॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!