Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6646

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: దేశి

కరుణగలవాఁడవు ఘనుడ విన్నిటా నీవు
తరుణిని నాతో నిట్టె తగులై వుండుమీ॥పల్లవి॥
  
  
చెక్కులు నొక్కితి నిన్ను సేదలు దేరిచితిని
మక్కువతో నన్నిట్టె మన్నించుమీ
మొక్కులు మొక్కి నీపై మోహము నేఁజల్లితి
తక్కుక నాపై నిఁక దయవెట్టుమీ॥కరు॥
  
  
కన్నుల నే జూచితిని కందువలు నంటితిని
వెన్నెలనవ్వులు నాపై వెదచల్లుమీ
చన్నుల నొత్తితి నీతో సరసములూ నాడితి
యిన్నిటా మంచితన మిటు నాకుఁ జూపుమీ॥కరు॥
  
  
సేవలు నేసితి నీకు జెప్పితి బ్రియములెల్లా
కైవశమై నీవు నాకు గలిగుండుమీ
వావులు చెప్పితి నీవు వరమిచ్చి కూడితివి
శ్రీవేంకటేశ్వర నన్ను జిత్తగించుమీ॥కరు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!