Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6651

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: గుజ్జరి

కరుణానిధివిగాఁగ కాచేవు గాక
యిరవై నావంటివాని కిది యసంగతము॥పల్లవి॥
  
  
నేర నే పుణ్యము సేయ నిత్యానిత్య మెఱిఁగి
నేరుతు రిత్తచేతుల నీకు మొక్కేది
యేరీతిఁ బరమిచ్చేవొ యేమి గలదు నాయందు
కారణములేని యీవి కడు ననంగతము॥కరుణా॥
  
  
లేదు విజ్ఞానము గొంత లేశమైన నాయందు
సాదించఁ గద్దొకటి మీ శరణనేది
ఆదిగొని నన్నుఁ బాయ వంతరాత్మవై నీవు
వీదరవెల్లి పొందులు విన ననంగతము॥కరుణా॥
  
  
కాను నే నరుహుఁడను కదిసి పనులకు
నే నవుదు నొకటికి నిన్నుఁ బాడను
యీ నెపాన శ్రీ వేంకటేశ నన్ను నేలితివి
దానికిఁ దగ్గంతె కాక దాఁట ననంగతము॥కరుణా॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!