Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6693

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: సామంతం

కలలోని సుఖమే కలియుగమా - వెన్న
కలిలో నెక్కడిదె కలియుగమా॥పల్లవి॥
  
  
కడిగడి గండమై కాలము గడపేవు
కడుగఁగడుగ రొంపి కలియుగమా
బడలికె వాపవు సరమేదో చూపవు
గడిచీటియును నీవు కలియుగమా॥కలలోని॥
  
  
కరపేపు కఱతలే మఱపేవు మమతలే
కరకఱ విడువవు కలియుగమా
తెరచీర మఱఁగింతే తెరువేల మూసేవు
గరునేల దాఁటేవో కలియుగమా॥కలలోని॥
  
  
కానిదె మెచ్చేవు కపటాలే యిచ్చేవు
కానీలే కానీలే కలియుగమా
పైనిదే వేంకటపతి దాసులుండఁగ
కానవా నీ విదేమి కలియుగమా॥కలలోని॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!